మాధురి దీక్షిత్ పెళ్లి వార్త వినగానే.. దీపికా పదుకొనే తండ్రి గదిలోకి వెళ్లి ఏం చేసారో తెలుసా ?

మాధురి దీక్షిత్. అందం అనే పదం ఇక ఈమెను చూసిన తర్వాతే పుట్టిందేమో అని అనిపిస్తూ ఉంటుంది.

 Deepika Padukone Father Reaction After Madhuri Dixit Marriage Announcement Detai-TeluguStop.com

పొరపాటున ఇంద్రలోకంలో ఉండాల్సిన దేవకన్య భూమి మీదికి వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంటుంది.దేవుడు ఆమె వయసు 30 ఏళ్లు దగ్గరే ఆపేసాడేమో అని అనిపిస్తూ ఉంటుంది.

ఎందుకంటే దశాబ్దాలు గడుస్తున్నా చెక్కుచెదరని అందం మాధురిదీక్షిత్ సొంతం.ఎంతో మంది యువ హీరోయిన్లు ఉన్న అందం అభినయం లో మధురమైన సొగసు సోయగం మాధురిదీక్షిత్ కు మాత్రమే సొంతం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

ఇక అలాంటి మాధురి దీక్షిత్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు హవా నడిపించింది అని చెప్పాలి.ఇక అప్పట్లోనే కాదు ఇప్పుడూ కూడా మోస్ట్ వాంటెడ్ బ్యూటీ గా ఆమె కొనసాగుతుంది.

ఎంతో మంది యువ హీరోలు వచ్చినా మాధురిదీక్షిత్ అందానికి సొగసుకు సరితూగరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.ప్రేక్షకులే కాదు సినీ ప్రముఖులు సైతం ఇక మాధురిదీక్షిత్ అందానికి అభిమానులుగా అవ్వకుండా ఉండలేకపోయారు.

ఈ క్రమంలోనే ఇటీవలే మాధురి దీక్షిత్ గురించి ఒక మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా పదుకొనే ఈ విషయాలను బయటపెట్టారు.

తన తండ్రి ప్రకాష్ పదుకునే అందాల తార మాధురి దీక్షిత్ కి అభిమాని అనడం కంటే వీరాభిమాని అంటే బెటర్ అంటూ దీపిక తెలిపింది.

Telugu Actressmadhuri, Bollywood, Madhuri Dixit-Movie

అయితే మాధురి దీక్షిత్ పెళ్లి వార్త తెలిసి మా నాన్న ప్రకాష్ పదుకునే ఎంతగానో బాధపడిపోయారు.మాధురి దీక్షిత్ పెళ్లి డేట్ బయటకు రాగానే ఆయన గుండె పగిలినంత నిరాశ చెందారు.ఆ బాధను తట్టుకోలేక కొన్ని గంటల పాటు తన గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని ఒంటరిగా బాధపడ్డారు అంటు దీపికా పదుకునే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.అంతలా అటు మాధురి దీక్షిత్ ను ప్రకాష్ పడుకొని ఆరాధిస్తూ ఉండేవాడని తెలిపింది.

అయితే ప్రకాష్ పదుకునే మాత్రమే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఉన్న ఎంతో మంది సినీ ప్రముఖులు సైతం ఆమె అందానికి ఫిదా అయిపోయారు అని చెప్పాలి.ఏదేమైనా దీపిక చేసిన క్రేజీ కామెంట్స్ తో మాధురి దీక్షిత్ అభిమానులు ఆనందపడి పోతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube