భౌగోళిక రాజకీయాల మార్పులో ప్రవాసులది కీలకపాత్ర : ఆమ్‌స్టర్‌డామ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

భౌగోళిక రాజకీయాలను మార్చడంలో భారత ప్రవాసులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.విదేశీ పర్యటనలో భాగంగా ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ఇండియన్ కమ్యూనిటీ రిసెప్షన్‌లో రాష్ట్రపతి పాల్గొన్నారు.

 Indian Community Abroad Playing A Role In Changing Region's Geo-politics: Presid-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.విదేశాల్లో వున్న భారతీయ పౌరులందరి భద్రత, సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.తన రెండు దేశాల పర్యటన ముగింపు సందర్భంగా తుర్క్‌మెనిస్థాన్ నుంచి సోమవారం ఆమ్‌స్టర్‌డామ్‌కు చేరుకున్నారు రామ్‌నాథ్ కోవింద్.1988లో అప్పటి రాష్ట్రపతి ఆర్ .వెంకటరామన్ తర్వాత 34 ఏళ్లకు నెదర్లాండ్స్‌లో భారత రాష్ట్రపతి పర్యటించడం ఇదే తొలిసారి.

నెదర్లాండ్స్ రాజు అలెగ్జాండర్, క్వీన్ మాక్సిమా ఆహ్వానం మేరకు ఏప్రిల్ 4 నుంచి 7 వరకు పర్యటించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ .పలు ద్వైపాక్షిక అంశాలపై ప్రధాని మార్క్ రూట్‌తో చర్చలు జరిపారు.ఈ క్రమంలోనే ఇక్కడి ప్రవాస భారతీయులను రాష్ట్రపతి కలిశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.మీ విజయాలను చూసి, మీ పూర్వీకుల భూమి మిమ్మల్ని చూసి గర్వపడుతుందన్నారు.

వందే భారత్ మిషన్ ద్వారా కోవిడ్ 19 సమయంలో భారతీయ పౌరులు క్షేమంగా స్వదేశానికి తిరిగి రావడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుందని రాష్ట్రపతి తెలిపారు.

Telugu Indian, Indiancommunity, Ramnath Kovind, Queen Maxima, Venkataraman, Turk

ఇటీవల ఉక్రెయిన్- రష్యా యుద్ధం నేపథ్యంలో ఆపరేషన్ గంగా ద్వారా అక్కడ చిక్కుకుపోయిన దాదాపు 23,000 మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చినట్లు రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.మోడీ చెప్పినట్లు.ఆపరేషన్ గంగా వెనుక మానవత్వం వుందని.

పాస్‌పోర్ట్ రంగు కాదని ఆయన పునరుద్ఘాటించారు.నెదర్లాండ్స్- భారత్ మధ్య దౌత్య సంబంధాల స్థాపన జరిగి 75 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ఈ వార్షికోత్సవ వేడుకల ఉమ్మడి లోగోలో వున్న తులిప్, కమలం ద్వారా ఇరు దేశాల స్నేహ సంబంధాలకు నిదర్శనమన్నారు.

చదువులు, పరిశోధనలు, ఆవిష్కరణలలో రాణిస్తున్న భారతీయ విద్యార్ధులు గణనీయమైన సంఖ్యలో నెదర్లాండ్స్‌లో వున్నారని రాష్ట్రపతి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube