అల్లు అర్జున్, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కామెంట్స్ వైరల్!

కొన్నేళ్ల క్రితం వరకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు కాదు.

ఒకవేళ టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటించాల్సి వచ్చినా ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ డిమాండ్ చేసేవారు.

అయితే గత కొన్నేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు స్వయంగా టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి నటించాలని ఉందని చెబుతున్నారు.

కొందరు బాలీవుడ్ హీరోయిన్లు ఏకంగా టాలీవుడ్ హీరోలే తమ ఫేవరెట్ హీరోలు అని చెబుతున్నారు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటించిన గెహ్రైయాన్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజవుతోంది.

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా దీపికా పదుకొనే మీడియాతో ముచ్చటించారు.ఆ ఇంటర్వ్యూలో ఇప్పటివరకు నటించిన స్టార్ హీరోలు కాకుండా ఏ హీరోలతో నటించాలని ఉందని దీపికా పదుకొనేకు ప్రశ్న ఎదురైంది.

Advertisement

ప్రస్తుతం ప్రభాస్ కు జోడీగా ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్న దీపికా పదుకొనే ఆ ప్రశ్నకు స్పందిస్తూ తనకు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని వెల్లడించారు.ఈ ఇద్దరు హీరోలతో నటించాలని ఉందని చెబుతూ దీపికా పదుకొనే అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు.

దీపికా పదుకొనే చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.పుష్ప ది రైజ్ తో బాలీవుడ్ లో బన్నీకి ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది.ఆర్ఆర్ఆర్ మూవీ ట్రైలర్ వల్ల బాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.

తారక్, బన్నీ తమ భవిష్యత్తు సినిమాలలో దీపికా పదుకొనేకు ఛాన్స్ ఇస్తారేమో చూడాల్సి ఉంది.దీపికా పదుకొనే నటిస్తే ఇతర భాషల్లో కూడా సినిమాలకు మంచి స్థాయిలో బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు టాలీవుడ్ స్టార్ హీరోలపై మనసు పారేసుకోవడం గమనార్హం.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు