దీపికాకి మరోసారి విచారణ తప్పేలా లేదు... ఉచ్చు బిగిస్తున్న ఎన్సీబీ

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారణ వేగవంతం చేశారు.

రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారంతో పాటు, కొంత మంది కీలక వ్యక్తుల ద్వారా దొరికిన ఆధారాలతో బాలీవుడ్ హీరోయిన్స్ పై ఉచ్చు బిగించింది.

ఈ విచారణలో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు, బాలీవుడ్ హీరోయిన్స్ అయినా దీపికా పడుకునే, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ లని ఎన్సీబీ అధికారులు విచారించారు.ఈ విచారణలో వారి వద్ద నుంచి కీలక సమాచారం అధికారులు రాబట్టినట్లు తెలుస్తుంది.

వారందరూ ముఖ్యంగా డ్రగ్స్ చాటింగ్ చేసినట్లు ఎన్సీబీ అధికారుల ముందు అంగీకరించారనే మాట వినిపిస్తుంది.అయితే ఈ విచారణలో భాగంగా హీరోయిన్స్ ఇచ్చిన సమాచారంతో వారు సంతృప్తి చెందకపోవడంతో వారి వద్ద నుంచి సెల్ ఫోన్ లో స్వాధీనం చేసుకున్నారని, వాటిలోఇంకా ఎవరైనా ఆధారాలు దొరుకుతాయేమో అనే కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

మొత్తం డ్రగ్స్ దందాకు దీపికా పదుకొనే మధ్యవర్తిగా వ్యవహరించినట్టు ఎన్సీబీ అధికారులు సాక్ష్యాలు సంపాదించారని తెలుస్తోంది.ఆమె అడ్మిన్ గా ఉన్న వాట్స్ యాప్ గ్రూప్ లోనే చాటింగ్ అంతా జరిగిందని నిర్ణయానికి వచ్చిన అధికారులు, శనివారం నాటి విచారణలో ఆమెకు క్లీన్ చిట్ ఇవ్వకపోగా, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకుని మరోసారి విచారణకు రావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Advertisement

ఒక వేళ ఈ డ్రగ్స్ కేసులో ఆమెకి సంబంధాలు ఉన్నాయని ఆధారాలతో రుజువు అయితే అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉందనే మాట బిటౌన్ లో వినిపిస్తుంది.ఇక ఇదే సమయంలో శ్రద్ధా కపూర్ ని విచారించగా పార్టీ చేసుకున్న మాట వాస్తవమే అయినా అందులో ఎలాంటి డ్రగ్స్ వాడలేదని, తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని ఎన్సీబీ అధికారుల ముందు చెప్పినట్లు తెలుస్తుంది.

అయితే డ్రగ్స్ తీసుకునే అలవాటు లేకపోతే డ్రగ్స్ గురించి చాటింగ్ ఎందుకు చేసినట్లు అనే కోణంలో పోలీసులు విచారణ చేయడంతో పాటు అవసరం అయితే వారికి డ్రగ్స్ శాంపిల్స్ టెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు