ఐపీఎల్ వింక్ గర్ల్ ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

ఒక టీజర్ లో కన్నుకొట్టి రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోయిన నటి ప్రియా ప్రకాష్ వారియర్ గురించి అందరికి తెలిసిందే.

ఒక్క వీడియోతో రాత్రికి రాత్రి సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయిన ప్రియాకి ఆ తరువాత యాడ్ కంపెనీల నుంచి విపరీతంగా అవకాశాలు వచ్చాయి.

దీంతో ఫుల్ గా యాడ్స్ చేసేసి రెండు చేతులా ఈ భామ సంపాదించుకుంది.ఈ భామకి వచ్చిన క్రేజ్ తో ప్రియా ఇన్స్టాగ్రామ్ ఫలోవర్స్ లక్షల్లో పెరిగిపోయారు.

ఇదిలా ఉంటే తాజాగా మరో బ్యూటీ ఇలాగే సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతుంది.అయితే దానికి ఈ సారి ఐపీఎల్ వేదిక అయ్యింది.

శనివారం బెంగళూరులో చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, సన్‌రైజర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఈ అందాల భామ వెలుగులోకి వచ్చింది.ఆర్‌సీబీ జెండా ఊపుతూ, ఆకట్టుకునే ఆహార్యంతో హుషారుగా గ్యాలరీలో ఎంజాయ్ చేస్తోన్న ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది.

Advertisement

ఇక ఆమె గురించి అందరూ సెర్చ్ చేయడం మొదలెడితే ఈ ఆర్‌సీబీ ఫ్యాన్‌ గర్ల్ పేరు దీపికా ఘోష్‌ అని తెలిసింది.ఈమె కాలిఫోర్నియాలోని ఓ కళాశాలలో నృత్యంలో ప్రావీణ్యం సంపాదించింది.

బ్యాలెట్, బాలీవుడ్, హిప్‌హాప్‌, జాజ్‌, ఆఫ్రికన్ డ్యాన్స్‌, మోడ్రన్‌ థెరపీ డ్యాన్సుల్లో శిక్షణ పొందింది.ఈ భామకి బాలీవుడ్ లో కూడా పరిచయాలు ఉన్నట్లు ఆమె ఇన్స్టా చూస్తే తెలిసిపోతుంది.

అలాగే ఈమె ఫలోవర్స్ కూడా రెండు లక్షలకి పైగా ఉన్నారంటే ఎ రేంజ్ లో సోషల్ మీడియాని ఊపెస్తుందో అర్ధం చేసుకోవచ్చు.

జూనియర్ ఎన్టీఆర్ పేరు బాలయ్యకు నచ్చదా.. తన తండ్రి పేరు దక్కడం బాలయ్యకు ఇష్టం లేదా?
Advertisement

తాజా వార్తలు