క్రిస్మస్ పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకుంటారు.సాధారణంగా క్రిస్మస్ పండుగ అంటేనే అందరికీ సాంటా గుర్తుకు వస్తాడు.
అలాగే క్రిస్మస్ ట్రీ కూడా గుర్తుకు వస్తుంది.చాలామంది ఇండ్లలో ఆ రోజు కచ్చితంగా ఈ ట్రీని పెట్టుకుని పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.
క్రిస్టియన్లు ఎంతో పవిత్రంగా భావించే ఈ పండుగలో క్రిస్మస్ ట్రీ అత్యంత ప్రత్యేకం.అయితే ఓ వ్యక్తి ఇలాగే క్రిస్మస్ ట్రీని అలంకరించి కటకటాల పాలయ్యాడు.
అదేంటి అలంకరిస్తే తప్పేంటి అనుకుంటున్నారు కదా.కానీ ఇందులో ఓ కిటుకు కూడా ఉందండోయ్.
సాధారణంగా ఏదైనా పనిలో కొత్త దనం చూపించాలని ఎవరికైనా ఉంటుంది.అందరూ చేసినట్టు రొటీన్ గా చేస్తే కిక్ ఏముంటుంది అందుకే ప్రతి దాంట్లో కొత్త దనాన్ని వెతుక్కుంటారు చాలామంది.
ఇప్పుడు కూడా ఓ వ్యక్తి ఇలాగే క్రిస్మస్ ట్రీలో కొత్త దనాన్ని వెతుక్కోవాలని తాపత్రయ పడి చివరకు కటకటాల్లో ఇరుక్కున్నాడు.అతను క్రిస్మస్ ట్రీని అందరిలాగా లైట్లు, డబ్బులతో కాకుండా అందులో అడిషనల్ .
గా మాదక ద్రవ్యాలను వాడాడు.మాదక ద్రవ్యాలతో ఆ చెట్టును అలంకరించి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

ఇక ఆ ఫొటోలు కాస్తా చివరకు పోలీసుల వరకు చేరుకున్నాయి.ఇంకేముంది వాటిని చూసిన ఆ పోలీసులు అతని కోసం ఎంక్వయిరీ చేసి చివరకు అరెస్టు చేశారు.ఇందుకు సంబంధించిన ఆ క్రిస్మస్ ట్రీ ఫొటోలను పోలీసులు నెట్టింట్లో షేర్ చేశారు.ఇక ఆ నిందితుడి దగ్గరి నుంచి దాదాపు రూ.37 లక్షలను రికవరీ చేసుకున్నారు పోలీసులు.ఇక ఇతనితో పాటు ఆ మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్న మరో ఎనిమిది మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ చెక్కర్లు కొడుతోంది.