Hit 2 matti kusti : ఈ వారం థియేటర్, ఓటీటీలలో విడుదల అవ్వనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

సినిమా ప్రియులకు సినిమా తప్ప మరో ప్రపంచం ఉండదని చెప్పవచ్చు.ఎందుకంటే ప్రతివారం వచ్చే సినిమాల కోసం ముందుగానే బాగా ప్లాన్స్ చేస్తూ ఉంటారు.

 December 2 Release Theater And Ott Films Details Inside Ott Releases, Tollywood,-TeluguStop.com

వీళ్ళు కేవలం తమ అభిమాన హీరోల సినిమాలే కాకుండా కంటెంట్ బాగుంటే చిన్న సినిమా హీరో అయినా చూడటానికి ఇష్టపడతారు.అందుకే వచ్చేవారం ఏ సినిమా విడుదల అవుతుందో ముందే చూసుకొని ప్లాన్స్ చేసుకుంటారు.

ఇక ఈ మధ్య ఓటీటీ ప్రభావం కూడా బాగా ఉండటంతో అందులో కూడా సిరీస్ చూడటానికి బాగా ఇష్టపడుతున్నారు.ఇక ఈ వారం ప్రేక్షకులకు ముందుకు రానున్న సినిమాలు, సీరియస్ లు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

అడవి శేష్, మీనాక్షి జంటగా నటించిన సినిమా హిట్ 2.శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మీ కలిసి నటించిన సినిమా మట్టి కుస్తీ.చెల్ల అయ్యావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కూడా డిసెంబర్ 2న విడుదల కానుంది.

ఆర్ పన్నీర్ సెల్వన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా జల్లికట్టు బసవ.ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతికీలక పాత్రలో నటించగా ఈ సినిమా కూడా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.నిర్ణయ్ పల్నాటి దర్శకత్వంలో రూపొందిన సినిమా నేనెవరు.బాలకృష్ణ కోల, ప్రభాకర్, రావు రమేష్ తదితరులు నటించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది.

Telugu Matti Kusti, Nenevaru, Ott Releases, Telugu, Tollywood-Movie

ఇక ఓటీటీ లో విడుదలయ్యే సినిమాలు, సిరీస్ లు ఏంటో చూద్దాం.నెట్ ఫ్లిక్స్ లో క్రైమ్ సీన్ టెక్సాక్ కిల్లింగ్ ఫీల్డ్స్ అనే వెబ్ సిరీస్ నవంబర్ 29న స్ట్రీమింగ్ కానుంది.మై నేమ్ ఈస్ వెండెట్టా అనే ఇటాలియన్ మూవీ నవంబర్ 30న స్ట్రీమింగ్ కానుంది.ట్రోల్ అనే నార్వేజియన్ మూవీ డిసెంబర్ 1న స్ట్రీమింగ్ కానుంది.జంగిల్ లాండ్ అనే హాలీవుడ్ మూవీ డిసెంబర్ 1న, గుడ్ బై అనే హిందీ మూవీ డిసెంబర్ 2న స్ట్రీమింగ్ కానుంది.

Telugu Matti Kusti, Nenevaru, Ott Releases, Telugu, Tollywood-Movie

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విల్లో అనే వెబ్ సిరీస్ నవంబర్ 30న, రిపీట్ అనే తెలుగు మూవీ డిసెంబర్ 1న, డైరీ ఆఫ్ ఎ వింపీకిడ్ అనే రోడ్రిక్ రూల్స్ డిసెంబర్ 2న, ఫ్రెడ్డీ అనే బాలీవుడ్ మూవీ డిసెంబర్ 2న, మాన్స్టర్ అనే మలయాళం మూవీ డిసెంబర్ 2న ప్రసారం కానున్నాయి.జి ఫైవ్ లో ఇండియన్ లాక్ డౌన్ అనే బాలీవుడ్ మూవీ డిసెంబర్ 2న, మాన్సూన్ రాగ అనే బాలీవుడ్ మూవీ డిసెంబర్ 2న ప్రసారం కానుంది.ప్రైమ్ వీడియోలో క్రష్ద్ అని వెబ్ సిరీస్, కాంతారా (తుళు) మూవీ, వదంతి అనే సిరీస్ లు కూడా డిసెంబర్ 2న ప్రసారం కానున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube