టీఆర్ఎస్ పార్టీలో రోజు రోజులు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే రెండు సర్వేలు చేయించుకున్న కెసీఆర్ అందులో కొంత మిశ్రమ ఫలితాలు రానున్నాయని తేలడంతో ఇక పార్టీ బలోపేతంపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఇప్పటికే జిల్లా అధ్యక్షులపై నిర్ణయాన్ని ప్రకటించిన కెసీఆర్ ఇక రాష్ట్ర స్థాయిలో ఒక జంబో కమిటీని త్వరలో ప్రకటించనున్న నేపథ్యంలో ఇప్పటికే దానిపై తెరవెనుక తీవ్ర కసరత్తు చేస్తోన్న పరిస్థితి ఉంది.అయితే రాష్ట్ర కమిటీలో మాత్రం ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నాయకులకే ఇందులో చోటు దక్కే అవకాశం ఉందనే ఒక ప్రచారం ఇటు టీఆర్ఎస్ వర్గాలలో, రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.
అయితే ఆ కమిటీ లో స్థానం కొరకు టీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది నాయకులు ఇప్పటికే చాలా ఆశగా ఎదురు చేస్తున్న నేపథ్యంలో ఇక ఎవరి అంచనా ప్రకారం వారు తమకు స్థానం దక్కుతుందని చాలా నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది.అయితే రాష్ట్ర కమిటీలో స్థానం దక్కిన వారే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది.
అయితే కెసీఆర్ మదిలో ఎవరు ఉన్నారనే విషయంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.అయితే కెసీఆర్ వ్యూహాలకు తగ్గట్టు ఈ రాష్ట్ర కమిటీని ఏ విధంగా నడిపిస్తారు, ఏయే విషయాల్లో రాష్ట్ర కమిటీ అనేది కీలక పాత్ర పోషిస్తుంది అనే విషయాలపై ఇప్పటికప్పుడు క్లారిటీ రాకున్నా రాబోయే రోజుల్లో కెసీఆర్ కదలికలను బట్టి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
మరి రాష్ట్ర కమిటీ నియామకంలో కెసీఆర్ ఏయే విషయాలను పరిగణలోకి తీసుకుంటారనే విషయంపై రాష్ట్ర కమిటీ ప్రకటన తరువాత కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.