ఆ ఎమ్మెల్యే మరణంతో వైసీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం.. !

ఈ మధ్య కాలంలో వార్తల్లో ప్రముఖల మరణాల వార్తలు తరచుగా వస్తున్నాయి.ఈ క్రమంలోనే మరో వైసీపీ నేత మరణించిన ఘటనతో ఏపీ రాజకీయాల్లో విషాదం చోటు చేసుకుంది.2019లో వైసీపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన, కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య కన్నుమూశారు.

 Death Of Ycp Mla Kadapa, Badvel, Ycp Mla, Death, Venkata-subbaiah, Ysrcp-TeluguStop.com

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటసుబ్బయ్య ఈరోజు ఉదయం 6:30 సమయం లో ప్రాణాలు విడిచారని సమాచారం.కాగా కడపలోని అరుణాచలం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటసుబ్బయ్య ఆరోగ్యం సహకరించక తుదిశ్వాస విడినట్లు వైద్యులు వెల్లడించారట.

కాగా సుబ్బయ్య మృతితో ఆయన కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు.

ఇక వైసీపీ శ్రేణుల్లోనూ కూడా తీవ్ర విషాదం నెలకొంది.మరణించిన సుబ్బయ్య ఆత్మకు శాంతి చేకురాలి అని ఆశిస్తూ కార్యకర్తలు ఆయన మృతదేహనికి నివాళి అర్పిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube