టాలీవుడ్ రౌడి స్టార్ విజయ దేవరకొండ నుంచి వచ్చిన ఎమోషనల్ లవ్ డ్రామా డియర్ కామ్రేడ్ పాజిటివ్ టాక్ తచ్చుకున్నప్పటికి సినిమాకు కాస్త నెగిటివ్ కామెంట్స్ కూడా తప్పలేదు.అంచనాల కారణంగా అన్ని వర్గాల ప్రేక్షకులను అంతగా సంతృప్తి పరచలేకపోయినట్లు కథనాలు వెలువడుతున్నాయి.

అయితే సినిమాలో కొన్ని సీన్స్ మూడ్ ని చేంజ్ చేస్తున్నాయని ఆడియెన్స్ బోర్ గా ఫీల్ కాకూడదని ట్రిమ్ చేస్తున్నారట.అసలైతే సినిమా మొత్తం నిడివి 2 గంటల 50 నిమిషాలు.ఇక ఇక ఇప్పుడు 13 నిమిషాల వరకు నిడివి తగ్గనున్నట్లు సమాచారం.అర్జున్ రెడ్డి తరువాత డియర్ కామ్రేడ్ కూడా అదే తరహాలో వర్కౌట్ అవుతుందనుకొని విజయ్ సీన్స్ ను పెద్దగా కట్ చేయించలేదు.
రన్ టైమ్ ని పట్టించుకోకుండా రిలీజ్ చేశారు.దీంతో అదే కాస్త ఇబ్బంది పెడుతోంది.
ఫైనల్ గా సెకండ్ హాఫ్ రన్ టైమ్ ని ఇప్పుడు తగ్గించినట్లు తెలుస్తోంది.శుక్రవారం నుంచి ట్రిమ్ చేసిన సినిమాను థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు.
మరి ఈ ఆలోచనతో సినిమా కలెక్షన్స్ ఎంతవరకు పెరుగుతాయా చూడాలి.







