ఎన్టీఆర్ జిల్లాలో నకిలీ డాక్యుమెంట్స్ తయారీ చేసి అక్రమాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు..

విజయవాడ గాంధీనగర్ సబ్ రిజిస్టర్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్స్ రావడంతో ముఠాను గుర్తింపు.నకిలీ డాక్యుమెంట్స్ తయారీ చేసి అమాయకుల ఆస్తులు కాజేస్తున్న 5 వ్యక్తుల అరెస్ట్ చేసిన గవర్నర్ పేట పోలీసులు.విశాల్ గున్ని, డీసీపీ కామెంట్స్ముద్దాయి లపై cr no.1/2023 u/s 419, 420, 465, 467, 468 & 120(b) ipc గా సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసాం.ఈ ముఠా సభ్యులు విశాఖ నుండి అనేక నకిలీ డాక్యుమెంట్స్ ద్వారా భూములను అమ్మి భారీ మొత్తంలో అవినీతికి పాల్పడ్డారు.ఒక ఆస్తిని తాకట్టు పెట్టిన లేదా యజమాని దూరంగా ఉన్నవారిని గుర్తించి వారి డాక్యుమెంట్స్ ముందుగా ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసి లింక్ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు.

 Dcp Vishal Gunni Ips Caught Land Fake Documents Gang,fake Documents,dcp Vishal-TeluguStop.com

తరువాత ఆ ఆస్తిని అమ్మకానికి పెడతారు.ఇప్పటి వరకు విశాఖ,పశ్చిమగోదావరి,గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 19 ప్రాంతాల్లో భూములను అమ్మి సొమ్ము చేసుకున్నారు.

ప్రజలంతా ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.విలువైన ఆస్తి పత్రాలకు సంబంధించిన జిరాక్స్ కాపీలను ఎవరికి ఇవ్వకూడదు.

అమ్మకాలు కొనుగోలు సమయంలో బ్రోకర్లను నమ్మవద్దు.నేరుగా రిజిస్ట్రార్ ద్వారానే అమ్మకాలు కొనుగోలు చేయాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube