కోడ‌ళ్ల పాలి"ట్రిక్స్" వాటే సూప‌ర్‌

మ‌హిళ‌లు రాజ‌కీయాల్లో అంత‌గా రాణించ‌లేరు.అని కొంత‌మంది అనేస్తుంటారు.

 Mulayam’s Daughter In Laws Politics In Up-TeluguStop.com

కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు చూస్తే వారు ఈ అభిప్రాయం మార్చుకోవాల్సిందే! ఎందుకంటే స‌మాజ్‌వాదీ పార్టీలో ముస‌లానికి ప్ర‌ధాన కార‌ణం.వెనుక ములాయం కోడ‌ళ్ల `రాజ‌కీయాలు`.

పెద్ద కోడ‌లు డింపుల్‌, చిన్న కోడ‌లు అప‌ర్ణల వ్యూహ చ‌తుర‌త చూసిన సీనియ‌ర్ నేత‌లు ముక్కున‌వేలేసుకుంటున్నారు.ఇంకా చెప్పాలంటే త‌మ భ‌ర్త‌ల వెనుక ఉండి వ్యూహాలు ర‌చిస్తూ చ‌క్రం తిప్పుతున్నారు.

వీరి ఎత్తుల ముందు అటు భ‌ర్త‌లు, ఇటు ములాయం కూడా బ‌ల‌హీన‌మేనా అనే ప్ర‌శ్న‌లు వ్య‌క్త‌మవుతున్నాయి.సమాజ్ వాదీ పార్టీ ‘కుటుంబం’లో ముదిరిన ముసలంలో ములాయం కోడళ్ల పాత్ర కూడా మ‌రిచిపోలేం.

పార్టీని తండ్రి చేతుల్లోంచి తన చేతుల్లోకి తీసుకునేందుకు అఖిలేశ్ ప్ర‌య‌త్నిస్తున్న అఖిలేశ్‌కు భార్య డింపుల్ అండగా నిలిచారు.

అలాగే దీనిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్న ములాయం శిబిరంలో చిన్న కొడుకు ప్రతీక్ భార్య అపర్ణ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

డింపుల్‌, అప‌ర్ణ‌లు విరుద్ధ స్వ‌భావం క‌లిగిన వారు.డింపుల్‌ రాజకీయాల్లోకి వ‌చ్చాక ప‌రిణ‌తి సాధిస్తే.అప‌ర్ణ‌ ముందుగానే వ్యూహాల్లో ఆరితేరారు.

2012లో త‌న వార‌సుడిగా అఖిలేశ్‌ను ప్ర‌క‌టించారు ములాయం.అదే స‌మ‌యంలో ఆయ‌న రెండో భార్య సాధ‌నాగుప్తా.త‌న కొడుకు ప్ర‌తీక్‌ను వార‌సుడిగా ప్ర‌కటించాల‌ని కోరుకున్నారు.ప్ర‌తీక్ రాజ‌కీయాల్లో ఆసక్తి చూప‌క‌పోవడంతో.చిన్న కోడలు అప‌ర్ణ‌ను అఖిలేశ్‌కు పోటీగా రంగంలోకి దించాల‌ని భావించారు.

దీనిని ముందే ప‌సిగ‌ట్టిన‌ డింపుల్.అఖిలేశ్‌ను అల‌ర్ట్ చేశారు.

దీంతో బాబాయ్ శివ‌పాల్-అప‌ర్ణల వ్యూహాల‌ను స‌మ‌ర్థంగా తిప్పికొట్టారు.

అఖిలేశ్ ను ఎదుర్కోవడానికి ములాయం కుటుంబం నుంచి ఒక వ్యక్తి కావాలని కోరుకుంటున్న శివ్ పాల్.

అపర్ణ శక్తిసామర్థ్యాలను గుర్తించారు.అందుకే ఆమెకు ల‌క్నో కంటోన్మెట్ స్థానం నుంచి పోటీ చేస్తార‌ని ప్ర‌క‌టించారు.

అయితే అఖిలేశ్ ప్ర‌క‌టించిన అభ్య‌ర్థ‌లు జాబితాలో ల‌క్నో కంటోన్మెట్‌కు ఎవ‌రినీ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం విశేషం!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube