3 రోజుల్లోనే రూ. 71 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ పై నాని దండయాత్ర!

నాచురల్ స్టార్ నాని ( Nani ) తాజాగా నటించిన సినిమా ”దసరా”( Dasara ).ఈ సినిమాతో ఈయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

 Dasara Box Office Collection Day 3, Dasara Box Office Collections, Dasara Collec-TeluguStop.com

మొన్న శ్రీరామ నవమి సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుని న్యాచురల్ స్టార్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ సైతం అందుకుంటుంది.పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఐదు భాషల్లో మార్చి 30న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

నాని హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించగా.సంతోష్ నారాయణన్( Santosh Narayan ) సంగీతం అందించాడు.ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యిన ఈ సినిమా కలెక్షన్స్ లో కూడా దూకుడు చూపిస్తుంది.నాని చాలా ఏళ్ల తర్వాత బాక్సాఫీస్ మీద తన పరిధిని మించి దండయాత్ర చేస్తున్నాడు.

ముందు నుండి నాని కాన్ఫిడెంట్.టీమ్ అంతా కలిసి ప్రమోషన్స్ కోసం పెట్టిన ఎఫర్ట్స్ అన్ని కూడా ఈ సినిమా రిలీజ్ గ్రాండ్ కు సహాయ పడ్డాయి.ఈ సినిమా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను అందుకుంది.

అలాగే రెండు రోజుల్లోనే ఏకంగా 50 కోట్లు క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.దీంతో టైర్ 2 హీరోల్లో నాని సంచలన రికార్డ్ క్రియేట్ చేసాడు.

ఇక తాజాగా ఈ సినిమా మూడు రోజుల కలెక్షన్స్ ను మేకర్స్ ప్రత్యేకమైన పోస్టర్ ద్వారా అనౌన్స్ చేసారు.ఈ సినిమా మూడు రోజుల్లో 71 కోట్ల ( Dasara Box Office Collections ) రూపాయలు వసూళ్లు చేసినట్టు ప్రకటించారు.

మరి ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే 100 కోట్ల మార్క్ చేరుకోవడం దసరా సినిమాకు కష్టమేమి కాదు.చూడాలి ఈ సినిమాతో న్యాచురల్ స్టార్ నాని ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube