ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
తనను ఎన్నోసార్లు అవమానించారన్న ఆయన.కనీసం ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని వాపోయారు.
ఇప్పటివరకు అన్ని భరిస్తూ వచ్చానని, ఇకపై సహించేది లేదని స్పష్టం చేశారు.సీఎం జగన్ కు తనపై విశ్వాసం ఉన్నంత వరకు వైసీపీలోనే కొనసాగుతానని పేర్కొన్నారు.







