శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా 17వ తేదీ అంకురార్పణ జరగనుంది.ఈ నేపథ్యంలో ధ్వజారోహణం సందర్భంగా ధ్వజ స్తంభాన్ని అలంకరించేందుకు టీటీడీ అటవీ శాఖ వారు
విష్ణు దర్భతో తయారు చేసిన చాపను, తాడును మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఆలయ డిప్యూటీ ఓకు అందజేశామని టీటీడీ డీఎఫ్ఓ శ్రీనివాసులు తెలిపారు.







