తెలంగాణలో విద్యుత్, తాగునీటి సంక్షోభాలను అరికట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు.హైదరాబాద్ అభివృద్ధి కోసం బహుముఖ వ్యూహాంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.
ఐటీ ఎగుమతులతో పాటు ధాన్యం ఉత్పత్తిలోనూ అగ్రస్థానంలో ఉన్నామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.రాష్ట్రంలో మౌలిక వసతులతో పాటు పరిపాలన సంస్కరణలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.
తెలంగాణ విధానాలు, పథకాలను అనేక రాష్ట్రాలు అధ్యయనం చేశాయన్న కేటీఆర్ హైదరాబాద్ లో సుమారు 415 కిలోమీటర్ల మేర మెట్రో రైలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపోందించామని వెల్లడించారు.







