దర్బార్ సెన్సార్ టాక్.. రన్‌టైం ఎంతో తెలుసా?

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన తాజా చిత్రం దర్బార్ సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది.

తమిళ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో రజినీ ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు.

కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు తలైవా రెడీ అవుతున్నారు.అయితే ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.

Darbar Movie Completes Censor And Run Time Locked-దర్బార్ సె�

ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు సభ్యులు రజినీ యాక్టింగ్‌కు ఫిదా అయ్యారట.పోలీస్ పాత్రలో చాలా పవర్‌ఫుల్‌గా నటించారట రజినీకాంత్.

సినిమాలోని పంచ్ డైలాగులతో థియేటర్‌లలో విజిల్స్ పడటం ఖాయమని సెన్సార్ బోర్డు సభ్యులు తెలిపినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.ఇక ఈ సినిమా రన్‌టైంను కూడా చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు.

Advertisement

ఈ సినిమా రన్‌టైం 2 గంటల 39 నిమిషాలకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈ సినిమాలో రజినీ సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

తమిళ యంగ్ సెన్సేషన్ అనిరుథ్ రవిచందర్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించాడు.జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు