దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు ఇవ్వాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దళిత జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకమును మొదటి విడతలోనే అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని టి యు డబ్ల్యూ జె (ఐజేయు) జిల్లా కమిటీ మంగళవారం నాడు ఖమ్మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.ప్రధానంగా ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని దళిత జర్నలిస్టులు అందరికి తొలివిడతలోనే ఈ పథకం ఫలాలను అందించాలని ప్రత్యేకంగా విన్నవించడం జరిగింది.

 Dalit Bandhu Should Be Given To All Dalit Journalists , Dalit Bandhu, Transport-TeluguStop.com

అంతకుముందు టి యు డబ్ల్యూ జె (ఐజేయు) సారధ్యంలో ఏర్పాటుచేసిన దళిత బంధు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రెస్క్లబ్ లో జరిగిన సమావేశంలో దళిత జర్నలిస్టులందరికీ దళిత బంధు పథకాన్ని మొదటి దశలోనే అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జె ( ఐజె యు) రాష్ట్ర ఉపాధ్యక్షులు కే రామనారాయణ, ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర నాయకులు నర్వనేని వెంకటరావు ,టియుడబ్ల్యు జె (ఐ.జె.యు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వనం వెంకటేశ్వర్లు, ఏనుగు వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు మైస పాపారావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్, దళిత బంధు సాధన కమిటీ కన్వీనర్ కనకం సైదులు, కో కన్వీనర్ చెరుకుపల్లి శ్రీనివాస్,తో పాటు టీయూడబ్ల్యూజేఐజేయు జిల్లా నాయకులు యెగి నాటి మాధవరావు, గోపాల్ రావు కే శ్రీనివాస్, నామ పురుషోత్తం, మేడి రమేష్ , భాస్కర్, ఖమ్మం టీవీ శ్రీనివాస్, కొమిరే నాగేశ్వరరావు, టెన్ టీవీ రాంబాబు, సుధాకర్ ,విజయ్, ఏబీఎన్ సైదులు, మనం శ్రీనివాస్, మందుల ఉపేందర్ సునీల్, వెంకటరమణ అశోక్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube