తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్15, శనివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.43

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.52

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.7.10 ల7.35

Advertisement

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

ఈరోజు మీ మాటతీరు ఇతరులకు భాధ కలిగిస్తుంది.ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది.ఋణదాతల ఒత్తిడి పెరుగుతుంది.

చేపట్టిన పనులు మందగిస్తాయి.వృత్తి వ్యాపారాలలో ఆర్ధిక నష్టాలు ఉంటాయి.

రూ. 1 కోటి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పినా.. కంటెస్టెంట్ కి నిరాశే..?
అల్లు అర్జున్ అరెస్టు పెద్ద కుట్ర ఉంది.. సింగర్ కల్పన షాకింగ్ కామెంట్స్?

ఉద్యోగమున అధికారుల కోపానికి గురవుతారు.సంతాన అనారోగ్య సమస్యలుంటాయి.

Advertisement

వృషభం:

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు.దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు.

నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి.

ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

మిథునం:

ఈరోజు ఇంటాబయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరత్వం ఉండదు.చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి.

వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.సోదరులతో వివాదాలు కలుగుతాయి.

వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి.దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు.నూతన ఋణప్రయత్నాలు చేస్తారు.

చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు కలుగుతాయి.ఉద్యోగస్తులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.

సింహం:

ఈరోజు కుటుంబ సభ్యులు నుండి ధనసహాయం లభిస్తుంది.గృహమున చిత్రవిచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

అవసరానికి సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.వృత్తి వ్యాపారాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని పనులు పూర్తిగా విజయవంతం అవుతాయి.దీని వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

మీ జీవితం మనశ్శాంతిగా ఉంటుంది.కొన్ని ఒప్పందాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి.

అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన అతిధి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తుల:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.కొన్ని శుభ వార్తలు వింటారు.మీ వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంది.

మీ మీద ఉన్న బాధ్యత తీరిపోతుంది.దీని వల్ల మనశ్శాంతి ఉంటుంది.

కొన్ని ప్రయాణాలు అనుకూలం గా ఉన్నాయి.ఈరోజు మీ స్నేహితుల వల్ల సంతోషంగా గడుపుతారు.

వృశ్చికం:

ఈరోజు ఆర్థికంగా కొంత వరకు అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవడంతో ప్రశంసలు అందుతాయి.అనవసరమైన గొడవలకు దిగకపోవడం మంచిది.

లేదా దీని వల్ల భవిష్యత్తులో సమస్యలు ఎదురవుతాయి.కొన్ని కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల సంతోషంగా ఉంటారు.

ధనుస్సు:

ఈరోజు దాయాదులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి.దూరప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉన్నవి.కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.

వ్యాపార ఉద్యోగాలు మరింత మందగిస్తాయి.సంతానం, విద్యా విషయాలలో కొంత నిరాశ తప్పదు.

దీని వల్ల ఇబ్బందులు ఎదురుకుంటారు.

మకరం:

ఈరోజు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి.ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.ఇంటాబయటా అనుకూల పరిస్థితులు ఉంటాయి.

చేపట్టిన పనులు సాఫీగా పూర్తి చేస్తారు.నిరుద్యోగులకు ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.

నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.

కుంభం:

ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ధన వ్యయం చేస్తారు.

విద్యార్థులకు గతం కంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి.నూతన గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు.

మీనం:

ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు మరింత ఉత్సాహంతో పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది.సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి.

బంధుమిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు.రాజకీయ వర్గం వారితో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

తాజా వార్తలు