బిసిలకు గత మూడున్నర సంవత్సరాలుగా ఏంచేసిందీ వైసీపి ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి డిమాండ్ చేబిసి లకు గుర్తింపు తెచ్చి, వారిలో నాయకత్వ లక్షణాలు నేర్పింది ఎన్టీయార్ అని వివరించారు.రాష్ట్ర ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో బిసిలకు చేసింది ఏమి లేదు కేంద్రంలో ఉన్న బిజేపి బిసిలను గుర్తిస్తుంది.
వైసిపి బిసి కార్పొరేషన్ లను ప్రారంభించటం కాదు… నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.బిసి కులాల మధ్య చిచ్చు పెట్టే రీతిలో బిసి కార్పొరేషన్లు వున్నాయి బీసీలకు ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలిశారు.
బిసిల కులాలవారీ విడదీసి కులాకుంపట్లు పెడుతోందని వైసీపిని దుయ్యబట్టారు.తొలుత రాష్ట్ర కార్యాలయం వద్ద ప్రవాస భారతీయుడు గొలగాని రవిక్రుష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన వారధి ప్రారంభోత్సవం శ్రీమతి పురందేశ్వరి చేతుల మీదుగా నిర్వహించారు.
పారిశుధ్య కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ ల పంపిణీ నిర్వహించారు.బిజెపి రాష్ట్ర కార్యాలయంలో మైనార్టీ మోర్చా రెండు రోజుల పాటు ప్రశిక్షణ కార్యక్రమాలను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభ ఉపాన్యాసంతో ప్రారంభమైంది.
జాతీయ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జనాబ్ జమాల్ సిద్దికీజీ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు.ప్రశిక్షణకు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ అధ్యక్షత వహించారు.మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి లాయఖ్ అలి, మైనార్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు షబనా, అనీఫ్ అలి, మైనార్టీ మోర్చా రాష్ట్ర ఇంఛార్జి నాగోతు రమేశ్ నాయుడు, ప్రకాష్ జైన్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషా తదితరులు వేదికనలంకరించారు.
ఈ సందర్భంగా పురందేశ్వరి తన ప్రసంగం కొనసాగిస్తు మైనార్టీ ల సంక్షేమానికి బిజెపి ఏవిధంగా కట్టుబడి ఉందనే విషయాలను కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను వివరించారు.
స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు మైనార్టీలను ఓటు బ్యాంకు గా చూస్తే బిజెపి ప్రభుత్వం మాత్రమే మైనార్టీలకు న్యాయం చేసేదిశగా అడుగులు వేయడం జరిగింది.త్రిబుల్ తలాఖ్ నుండి ముస్లిం మహిళలకు రక్షణ కల్పించింది కేవలం బిజెపి మాత్రమే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.
రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు ప్రతి ఇంటికి వెళ్లి కేంద్రం చేస్తున్న పధకాలను వివరించాలని కోరారు.బిజెపి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్ నాయుడు మాట్లాడుతూ మైనార్టీల్లో ఉన్న పేదరికాన్ని తొలగించి వ్యాపారస్తులుగా తీర్చిదిద్దేందుకు కేంద్రప్రభుత్వం చేస్తున్న క్రుషిని వివరించారు.
ప్రశిక్షణ కార్యక్రమంలో భారత రాజ్యాంగం పై రచించిన పుస్తకాన్ని దగ్గుబాటి పురందేశ్వరి చేతుల మీదుగా ఆవిష్కరించారు
.