చిన్నపిల్లల దేవుళ్లతో సమానం అని చెబుతుంటారు.ఎందుకంటే వారి మనసులో ఎలాంటి కల్మషం ఉండదు.
అలానే వారిలో ద్వేషం, హింస వంటి చెడ్డ లక్షణాలు కూడా అసలు కనిపించవు.వారు ప్రతి దానికి సహాయం చేయాలనుకుంటారు.
కాగా తాజాగా ఒక బుడ్డోడు పెద్ద మనసు చేసుకొని ఒక కోడిపుంజుకి తన బొమ్మ లారీపై లిఫ్ట్ ఇచ్చాడు.దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్లు ఈ బాబు చాలా మంచోడు అని కామెంట్లు పెడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక బాలుడు తన బుడ్డి సైకిల్‌కు బొమ్మ లారీని కట్టి లాక్కొని వెళ్లడం చూడవచ్చు.
ఇంతలో వెళ్తున్న దారిలో అతడికి ఒక ఓ కోడి పుంజు కనిపించింది.అయితే అది అక్కడ నీరసంగా కూర్చుని ఉండటం చూసినా బాలుడు అయ్యో పాపం అనుకుని దీనికి లిఫ్ట్ ఇద్దామనుకున్నాడు.
ఆపై దానిని చేత పట్టుకొని తన బొమ్మ లారీ ట్రక్‌పై కూర్చోబెట్టాడు.అలా దానికి లిఫ్ట్ ఇచ్చి మందుకు తీసుకెళ్లాడు.ఆ కోడి పుంజు కూడా లారీపై ఎంచక్కా కూర్చొని ఫ్రీగా లిఫ్ట్ పొందింది.ఈ వీడియోలో ఆ బుడ్డోడితో పాటు ఓ బాతు కూడా కనిపించింది.
కాగా బాలుడి తల్లిదండ్రులు ఈ బ్యూటిఫుల్ దృశ్యాన్ని తమ కెమెరా లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు.అది కాస్త వైరల్ గా మారింది.ఈ వీడియోకి ఇప్పటికే 11 లక్షల పైగా లైక్స్, కోట్లాది వ్యూస్ వచ్చాయి.దీన్ని చూసినా నెటిజన్లు ‘బ్యూటిఫుల్ వీడియో’, ‘క్యూట్ సీన్’ అని కామెంట్లు పెడుతున్నారు.
కోడిని పట్టుకుని బొమ్మ లారీపై ఉంచితే అది అక్కడి నుంచి దిగిపోకుండా, ఆ కోడి దాని నుంచి దిగిపోకుండా అలానే నిల్చుండిపోవడం చూస్తుంటే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అని ఒక యూజర్ కామెంట్ చేశాడు.మీరు కూడా ఈ క్యూట్ వీడియోని చూసేయండి.