తెలుగు మీడియాలో మొన్నటి వరకు శ్రీరెడ్డి ఏ స్థాయిలో మారు మ్రోగి పోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.శ్రీరెడ్డిని మా ఛానెల్ డిస్కషన్ రమ్మంటే మా ఛానెల్ డిస్కషన్‌కు రమ్మంటూ పలు ఛానెల్స్ వారు భారీ మొత్తం ఆఫర్ చేసి మరీ పిలిచారు.
అయితే ప్రస్తుతం ఆమెను ఛానెల్స్ వారు పిలవడం లేదు.ఆమె చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యల వల్ల సెలబ్రెటీలు ఛానెల్స్‌పై విరుచుకు పడుతున్నారు.
ఆ కారణంగానే ఆమె ఛానెల్స్‌లో కనిపించడం లేదు.అయితే ఆమె సోషల్ మీడియాలో మాత్రం తెగ వినిపిస్తుంది.
శ్రీరెడ్డి వల్ల పలువురి జీవితాలు తల కిందులు అయ్యాయి, ముఖ్యంగా దగ్గుబాటి సురేష్‌బాబు చిన్న కొడుకు అభిరామ్ పూర్తిగా కనుమరుగయ్యాడు.
సురేష్‌బాబు వారసుడిగా అభిరామ్ హీరో అవ్వాలనుకున్నాడు.అందుకోసం గత రెండు సంవత్సరాలుగా ఎంతో కష్టపడి బాడీని ఫిట్‌గా మార్చుకోవడంతో పాటు, చిన్నచిన్న ఆపరేషన్స్‌తో మొహం అందంగా తయారు చేయించుకున్నాడు.త్వరలోనే అభిరామ్ సినిమా మొదలు అవుతుందని భావిస్తున్న సమయంలో శ్రీరెడ్డి ఫొటోలు విడుదల చేయడంతో పాటు, ఆయనపై తీవ్ర స్థాయిలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సంచలన సృష్టించింది.
అభిరామ్ నన్ను వాడుకున్నాడు అని, ప్రేమించాను అంటూ మోసం చేశాడు అంటూ శ్రీరెడ్డి ఆరోపణలు చేసింది.తనకు అవకాశాలు ఇప్పిస్తాను అంటూ మోసం చేసిన అభిరామ్‌ను వదిలి పెట్టను అంటూ హెచ్చరించింది.
అభిరామ్‌ను వదిలేయమని, ఆయన గురించిన విషయం మర్చి పోవాల్సిందిగా శ్రీరెడ్డికి కొందరు సూచిస్తూ భారీ మొత్తం ఆఫర్ ఇచ్చారు కూడా.కాని శ్రీరెడ్డి మాత్రం అందుకు ఒప్పుకోలేదు.
సురేష్‌బాబు సైతం శ్రీరెడ్డితో డైరెక్ట్‌గా రాజీకి ప్రయత్నించకుండా ఏం జరిగితే అదే జరగనివ్వండి అంటూ సైలెంట్‌గా ఉన్నాడు.ఇదే సమయంలో తన కొడుకు అభిరామ్‌ను ఇంట్లోండి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేసేయడం జరిగింది.
మొత్తానికి హీరో అవ్వాలనుకున్న అభిరామ్ ప్రస్తుతం పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు.కనీసం క్లోజ్ ఫ్రెంట్స్ పార్టీలకు కూడా అభిరామ్ వెళ్లడం లేదని, షూటింగ్స్ ఇతరత్ర విషయాల్లో కూడా అభిరామ్‌ను జోక్యం చేసుకోనివ్వడం లేదని తెలుస్తోంది.
ఈ వివాదం ముగిసే వరకు అంటే కనీసం సంవత్సరం వరకు అభిరామ్‌ను మీడియా ముందుకు రాకుండా చూడాలని సురేష్‌బాబు ప్రయత్నిస్తున్నాడు.అభిరామ్ కూడా తండ్రి మాట ప్రకారం ఇంటికే పరిమితం అయినట్లుగా తెలుస్తోంది.
అన్ని అనుకున్నట్లుగా అయితే ఈ సంవత్సరంలో అభిరామ్ సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని భావించారు.కాని అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే జీవితం ఎలా అవుతుంది చెప్పండి.
శ్రీరెడ్డి వల్ల అభిరామ్ ముందు ముందు మరెన్ని సమస్యలు ఎదుర్కొంటాడో చూడాలి.అసలు అభిరామ్ హీరోగా ఒక్క సినిమా అయినా చేస్తాడా లేదా అనేది కూడా కొందరిలో వ్యక్తం అవుతున్న అనుమానం.