మాదాపూర్ ఇంచార్జ్ డీసీపీ శ్రీనివాస్… స్పెషల్ ఆపరేషన్ టీమ్ సంయుక్తంగా నకిలీ ఐపీఎస్ అధికారిని ఆరెస్ట్ చేసాము.నకిలీ ఐపీఎస్ అధికారిగా చలామణి అవుతున్న నాగరాజు.
నకిలీ ఐపీఎస్ గా , ఆర్మీ కల్నల్ గా, ఫేక్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా అవసరమెత్తిన కార్తీక్…నాగరాజు అలియాస్ కార్తిక్ ను ఆరెస్ట్ చేసాము.నాగరాజు పై చాలా నేరాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ భీమవరం కు చెందిన నగేష్.గతంలో బైక్ దొంగతనం లో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాడు.ప్రయివేట్ సెక్యూరిటి ఏజెన్సీ లో సైతం పనిచేసాడు.గతంలో పోలీస్ ఉద్యోగాల కోసం ట్రై చేసాడు.కానీ ఎక్కడ కూడా ఉద్యోగం రాలేదు.
దింతో నకిలీ అవతారం ఎత్తాడు.
ఆర్మీ లో జాబ్ వచ్చిందని ఊరు, బంధువులను వారందరిని నమ్మించాడు.ఊరు వాళ్ళు ఇతని నమ్మి ఫ్లెక్సీ లు సైతం పెట్టాడు.
మధుసూదన్ అనే వ్యక్తి ని పోలీస్ అని బెదిరించాడు.పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు అయ్యింది.
గతంలో పిడి యాక్ట్ లో ఆరెస్ట్ కూడా చేసాం.జైలు నుండి విడుదల అయినా తర్వాత మళ్ళీ నకిలీ దందా చేసాడు.
జార్ఖండ్ నుండి వేపన్స్ తీసుకొచ్చి దందా చేసాడు.పోలీస్ అధికారి లాగ చాలా మంది ని ఇన్ట్రాగెషన్ చేసాడు.
చిత్ర హింసలు పెట్టి డబ్బులు సంపాదించాడు.చాలా మంది కి జాబ్ లు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసాడు.రవి శంకర్ అనే వ్యక్తి ని ఫేక్ ఎన్ కౌంటర్ చేసినట్లు నమ్మించాడు.ఒక కంట్రీ మెడ్ పిస్టల్ తో పాటు కార్తిక్ కు చెందిన 23 వస్తువులు సీజ్.2 లక్షలు విలువ జేసే ప్రాపర్టీ స్వాధీనం చేసుకున్నాం.టెక్నీకల్ లో కూడా బాగా అరితేరాడు.
గవర్నమెంట్ అధికారులతో, ధోని తో ఉన్నట్లు ఫేక్ ఫోటో లు క్రియేట్ చేసాడు.ఫేక్ కిడ్నాప్ డ్రామాలు ఆడి డబ్బులు ఘడించాడు.
ఫేక్ ఐడి లు క్రియేట్ చేసాడు.