బంతితో ఆడుకుంటున్న నక్క పిల్లలు... వీడియో చూస్తే ఫిదా అవుతారంతే..!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తే నవ్వరాక తప్పదు.తాజాగా అలాంటి ఓ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఈ వీడియోలో నక్క పిల్లలు బంతితో ఆట ఆడుతూ చాలా ఎంజాయ్ చేశాయి.@yoda4ever ట్విట్టర్ యూజర్ ఈ వీడియోని షేర్ చేశారు.దీనికి ఇప్పటికే రెండున్నర లక్షల వ్యూస్ వచ్చాయి.

అలాగే 17 వేల లైకులు వచ్చాయి.వైరల్ అవుతున్న వీడియోలో బంతితో ఆడుకుంటున్న రెండు నక్క పిల్లలను చూడవచ్చు.

ఇవి ఒక పెరట్లో బంతిని చూసి బాగా సంబర పడ్డాయి.ఆ తర్వాత ఈ పిల్ల జంతువులు బంతితో ఆసక్తిగా ఆడుకోవడం మీరు గమనించవచ్చు.

నక్క పిల్లల్లో ఒక పిల్ల పిల్లిలా ఎగురుతూ బంతితో ప్లే చేయడం ముచ్చట గొలుపుతోంది.బంతిని పట్టుకునేటప్పుడు ఓ నక్క చాలా క్యూట్ గా బోల్తా పడింది.

Advertisement

ఏ బాధా లేకుండా హాయిగా ఆడుకుంటున్న ఈ నక్కలని పెరటి సమీపంలోని ఒక సీసీ టీవీ రికార్డ్ చేసింది.దీన్ని చూసిన ఆ పెరటి యజమానులు ఫిదా అయిపోయారు.అనంతరం దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ గా మారింది.@yoda4ever ట్విట్టర్ యూజర్ దీనికి "గార్డెన్‌లో బంతితో ఆడుకుంటున్న నక్క పిల్లలు," అనే క్యాప్షన్ జోడించాడు.

నక్క పిల్లల క్యూట్ నెస్ చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు.కొందరు పిల్లలను పెంపుడు జంతువుగా పెంచాలని తమ కోరికను వ్యక్తం చేస్తే, మరికొందరు జంతువులు ఆడుకున్న వీడియో ఫుటేజ్ మొత్తం తమకు కావాలని కోరారు.ఈ క్యూట్ వీడియోని మీరు కూడా చూసేయండి.

Advertisement

తాజా వార్తలు