కర్వ్ బడ్స్ ప్రో, మ్యాక్స్ నెక్‌బ్యాండ్ లాంచ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ...

ప్రముఖ ఆడియో బ్రాండ్ బౌల్ట్( Boult ) భారతదేశంలో తన కర్వ్ సిరీస్‌ని పరిచయం చేసింది, ఇందులో కర్వ్ బడ్స్ ప్రో TWS, కర్వ్ మ్యాక్స్ నెక్‌బ్యాండ్ అనే రెండు ఉత్పత్తులు ఉన్నాయి.ఈ ఉత్పత్తులు ప్రత్యేకంగా హై-క్వాలిటీ సౌండ్, లాంగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే గేమర్‌ల కోసం తీసుకొచ్చింది.

 Curve Buds Pro, Max Neckband Launch Low Price More Features, Boult, Curve Serie-TeluguStop.com

కర్వ్ బడ్స్ ప్రో TWS వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌( Boult Curve Buds Pro TWS )ఒకే ఛార్జ్‌తో 100 గంటల నిరంతర గేమింగ్‌ను అందిస్తాయి.అవి వేగవంతమైన ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తాయి, ఇది కేవలం 10 నిమిషాల ప్లగ్ ఇన్‌తో 130 నిమిషాల ప్లేటైమ్‌ను ఇస్తుంది.

ఈ ఇయర్‌బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీతో నాలుగు మైక్రోఫోన్లు ఉన్నాయి, ఇవి నాయిసీ వాతావరణంలో కూడా స్పష్టమైన వాయిస్ కాల్స్‌ను నిర్ధారిస్తాయి.వీటిలో హైఫై, రాక్, బాస్ బూస్ట్ వంటి మూడు ఈక్వలైజర్ మోడ్స్‌ కూడా ఉన్నాయి.

అంతేకాకుండా, ఇయర్‌బడ్స్‌ కంబ్యాట్ గేమింగ్ మోడ్‌ను కలిగి ఉన్నాయి, ఇది సాఫ్ట్, లాగ్-ఫ్రీ గేమింగ్ అనుభవం కోసం 40ms వరకు లేటెన్సీని తగ్గిస్తుంది.

Telugu Products, Battery, Boult, Curve, Buds, Launch, Noise, Wireless Buds-Techn

కర్వ్ మ్యాక్స్ నెక్‌బ్యాండ్( Curve Max neckband ) అనేది వైర్‌లెస్ హెడ్‌ఫోన్, ఇది క్విక్ 10 నిమిషాల ఛార్జ్‌తో 24 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుంది.ఇది 100-గంటల బ్యాటరీ లైఫ్, 50ms లేటెన్సీ గేమింగ్ మోడ్‌ను కలిగి ఉంది.నెక్‌బ్యాండ్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ఉంది, ఇది మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం యాంబియంట్ నాయిస్‌ను ఫిల్టర్ చేస్తుంది.

ఇది IPX5 వాటర్ రెసిస్టెన్స్, డ్యూయల్ డివైస్ కనెక్టివిటీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లను కూడా కలిగి ఉంది.

Telugu Products, Battery, Boult, Curve, Buds, Launch, Noise, Wireless Buds-Techn

సంగీత ప్రేమికులైనా లేదా హార్డ్‌కోర్ గేమర్ అయినా, మీ అవసరాలు, ప్రాధాన్యతల కోసం ఈ ప్రొడక్ట్స్ ఉత్తమంగా నిలుస్తాయని కంపెనీ తెలిపింది.అమెజాన్, అధికారిక వెబ్‌సైట్‌లో కర్వ్ సిరీస్ ఆకర్షణీయమైన ప్రారంభ ధరలో అందుబాటులో ఉంది.కర్వ్ బడ్స్ ప్రో TWS ధర రూ.1,299 (సాధారణ ధర రూ.1,799), కర్వ్ మ్యాక్స్ నెక్‌బ్యాండ్ ధర రూ.999 (సాధారణ ధర రూ.1,299)గా కంపెనీ నిర్ణయించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube