వాక్కాయ సాగు చేస్తే రైతులకు కాసుల పంటే..!

వ్యవసాయం( Agriculture )లో తక్కువ కాలంలో అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలు వేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

తరచుగా వేసే పంటలలో అధిక దిగుబడులు పొందలేకపోవడం, పైగా వ్యవసాయ కూలీల సమస్య తీవ్రంగా పెరుగుతోంది.

కాబట్టి రైతులకు తక్కువ సమయంలో అధిక ఆదాయం ఇచ్చే పంటలలో వాక్కాయ సాగు ఒకటి.వాక్కాయ మొక్క గుబురుగా పెరిగి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తాయి.

ఇది థాయిలాండ్( Thailand ) కు చెందిన వెరైటీ మొక్క.మొదటి ఏడాది నుంచే కాపు ఇస్తుంది.

నేల మీద లేదంటే కుండీల్లోనూ ఈ మొక్కలను పెంచుకోవచ్చు.కేవలం వారానికి ఒక్కరోజు నీటి తడిని అందిస్తే సరిపోతుంది.

Advertisement

ఈ విదేశీ రకం వాక్కాయ( Karonda ) ముళ్ళు లేకుండా సాఫ్ట్ గా ఉంటుంది.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 200 మొక్కలు పెంచుకోవచ్చు.మొక్కకు ముళ్ళు ఉండడం వల్ల పొలం చుట్టూ కంచె లాగా కూడా ఉపయోగపడుతుంది.

ఈ పంట సాగు చేపట్టిన మొదటి ఏడాది దిగుబడి తక్కువగానే ఉంటుంది.కానీ క్రమంగా దిగుబడి ప్రతి సంవత్సరం పెరుగుతుంది.

రెండేళ్ల వయసున్న చెట్టు నుండి 30 కిలోల వరకు వాక్కాయ కాయల దిగుబడి పొందవచ్చు.ఒక ఎకరం పొలం నుండి దాదాపుగా ఆరు టన్నుల దిగుబడి పొందవచ్చు.

ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.50 రూపాయల ధర పలుకుతోంది.ఇది అడవి జాతి మొక్క కావడంతో పెట్టుబడి చాలా తక్కువ.

మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్.. దుల్కర్ రూపంలో టాలీవుడ్ కు మరో స్టార్ హీరో దొరికారా?
ఎన్టీఆర్, యశ్ తర్వాతే ప్రభాస్ అంటున్న స్టార్ డైరెక్టర్.. ఫ్యాన్స్ కు భారీ షాకిచ్చారుగా!

నీటి అవసరం కూడా చాలా తక్కువ.ఏడాదిలో కనీసం ఐదు సార్లు నీటి తడి అందించిన సరిపోతుంది.

Advertisement

ఇక ఎరువుల విషయానికి వస్తే నేలను పరీక్ష చేయించి.పశువుల ఎరువుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.

పూత సమయంలో పంటను గమనిస్తూ ఉండి ఎలాంటి చీడపీడలు ఆశించకుండా ఒకటి లేదా రెండుసార్లు పిచికారి మందులు ఉపయోగిస్తే దిగుబడి పెరగాయే అవకాశం ఉంది.బేకరీల్లో ఉండే చెర్రీ పండ్లను వీటితోనే తయారు చేస్తారు.

తాజా వార్తలు