ఐపీఎల్ 13 వ సీజన్ లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ , చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై నిర్ణిత 20 ఓవర్లు ముగిసేలోపు 167 పరుగులు చేసింది.
చెన్నై ఓపెనర్ల విషయంలో ఊహించని మార్పు చేసింది.వాట్సన్ స్థానంలో సామ్ కరన్ ను ఓపెనర్ గా పంపి సక్సెస్ అయింది.
అయితే, మరోసారి డుప్లెసిస్ సున్నాకే అవుట్ అయ్యి నిరాశపరిచాడు.ఖలీల్ అహ్మద్ వేసిన ఓవర్లో సామ్ కరన్ రెచ్చిపోయాడు.
మొదటి రెండు బంతులను బౌండరీకి తరలించగా, మూడో బంతిని ఆరో బంతిని భారీ సిక్సర్లుగా మలిచాడు.చెన్నై టీం లో ఉత్సహం నింపుతున్న కరన్ ను సందీప్ శర్మ సూపర్ బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు.
ఆ తర్వాత వాట్సన్, అంబటి రాయిడు నిలకడ ఆడుతూ స్కోర్ వేగాన్ని పెంచారు.ఈ క్రమంలో ఖలీల్ ఆహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్ యత్నించి రాయిడు ఔటయ్యాడు.
చివరకు ధోనీ 21, జడేజా 25 దాటిగా ఆడి సీఎస్‌కే స్కోరును ఆ మాత్రం సాధించగలిగింది.సీఎస్‌కే లీగ్‌లో తొలిసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
రెండు తుది జట్టులో మార్పులు చేశాయి.చెన్నై జగదీషన్ స్థానంలో పియూష్ చావ్లాను తీసుకున్నారు.
ఇక హైదరాబాద్ జట్టులో కూడా మార్పు చేశారు.అభిషేక్ శర్మ స్థానంలో నదీమ్‌ను తుది జట్టులో అవకాశం కలిపించారు.







