పొట్ట కూటికోసం కోటి విద్యలు.. రుచి చూసి చెబితే గంటకు రూ. 1700..!- Crore Educations For Stomach Gathering Rs 1700

Chocolate, taste, 1700 rs, earing, VirAl post,social media,netizens,viral - Telugu 1700 Rs, Chocolate, Earing, Taste, Viral Post

బీరు రుచి చూసి ఎలా ఉందో చెప్తే లక్షల్లో డబ్బులు ఇస్తామని ఎన్నో సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ సుఖమైన జాబ్ దక్కించుకోవడానికి లక్షల మంది నిరుద్యోగులు అప్లై చేశారు కానీ వారిలో పదుల సంఖ్యలో మాత్రమే ఎంపికయ్యారు.

 Crore Educations For Stomach Gathering Rs 1700-TeluguStop.com

ఎందుకంటే ఇలాంటి జాబ్స్ సంపాదించాలంటే చాలా అరుదైన టాలెంటు ఉండాల్సి ఉంటుంది.రుచి ఎలా ఉందో కరెక్ట్ గా చెప్పగలగటం నిజంగా అందరికీ సాధ్యం కాదు.

అందుకే ఈ జాబ్స్ ఎక్కువమందికి లభించవు.బీరు ఒకటే కాదు కాఫీ, టీ లను రుచిచూసే ఉద్యోగాలు కూడా ఇటీవల బాగా పాపులర్ అయ్యాయి.

 Crore Educations For Stomach Gathering Rs 1700-పొట్ట కూటికోసం కోటి విద్యలు.. రుచి చూసి చెబితే గంటకు రూ. 1700..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జస్ట్ ఒక కుర్చీలో కూర్చుని కాఫీ చక్కగా తాగుతూ టేస్ట్ ఎలా ఉందో చెప్తే చాలు వేల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ అయిపోతాయి.

అయితే ఈ జాబు సంపాదించడం ఎంత కష్టమో.

జాబ్ చేయడం కూడా అంతే కష్టం అని అంటుంటారు.తినేముందు వాసన ఎలా వస్తుందో.

తినేటప్పుడు రుచి ఎలా ఉందో.తిన్న తర్వాత నోట్లో రుచి ఎలా ఉందో అనే అతి చిన్న విషయం గురించి కూడా వివరంగా కంపెనీలకు తెలియజేయాల్సి ఉంటుంది.

వీటిలో ఏ తేడా వచ్చినా కాఫీ టేస్టర్ కి కంపెనీ నుంచి అక్షింతలు పడిపోతాయి.ఐతే మొన్న బీరు, నిన్న కాఫీ టేస్ట్ చేసే జాబ్స్ రాగా.

ఇప్పుడు చాక్లెట్ టెస్ట్ చేసే జాబ్స్ యొక్క నోటిఫికేషన్స్ వస్తున్నాయి.

కెనడాకి చెందిన క్యాండీ ఫన్ హౌస్ అనే ఒక కంపెనీ తాము తయారు చేసే చాక్లెట్లు, క్యాండీ లను రుచి చూసి.వాటిలో అత్యంత రుచిగా ఉన్నవి ఏంటో చెప్పగలిగితే గంటకు రూ.30 కెనడియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది.అంటే భారత దేశ కరెన్సీ లో అక్షరాల 1700 రూపాయలు.ఈ కంపెనీలో టేస్ట్ చేసే జాబ్ తెచ్చుకోవడం అంత సులభమైన పని కాదని నిరుద్యోగులు అంటున్నారు.కెనడియన్ కంపెనీ మొత్తం 3000 వేల రకాల క్యాండీ లను తయారు చేస్తోందట.18 ఏళ్ల వయసు పైబడిన వారు ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు.వర్క్ ఫ్రం హోం అనే సౌకర్యాన్ని కూడా ఈ కంపెనీ కల్పిస్తోంది.ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో ఫిబ్రవరి 15వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

#Viral Post #Chocolate #Earing #Taste #1700 Rs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు