ఇంటర్నెట్ బ్రౌజర్ అనగానే మనకి గూగుల్ క్రోమ్ గుర్తుకు వస్తుంది.అది కంప్యూటర్ అయినా, మొబైల్ ఫోన్ అయినా, అత్యధికంగా వాడబడే బ్రౌజర్ క్రోమ్.
బిలియన్ కి పైగా మొబైల్ యూజర్లు క్రోమ్ వాడుతున్నారు.ఇప్పుడు క్రోమ్ వినియోగదారులందరిని జాగ్రత్తగా ఉండమంటున్నారు నిపుణులు.
ప్రస్తుతం క్రోమ్ ఉన్న వెర్షన్ లో కొన్ని లోపాలున్నాయట.వాటిని కనిపెట్టిన హ్యాకర్లు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారట.మాల్ వేర్స్ బాగా దింపుతున్నారని సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.
‘క్యాస్పర్ స్కై ల్యాబ్’ అనే కొత్త మాల్ వేర్ ద్వారా ఇప్పటికే దాదాపు మూడు లక్షల ఫోన్లపై దాడి చేశారట.సాఫ్ట్ వేర్ అప్డేట్ పేరుతో లక్షలకొద్దీ బ్యాంక్ అకౌంట్స్ లోకి చొరబడ్డారట.దీనికి క్రోమ్ లో ఉన్న లోపాలే కారణం.కాబట్టి క్రోమ్ ని కొన్నిరోజులుపాటు అన్ ఇన్స్టాల్ చేయడం కాని, లేదా కొత్త వెర్షన్ కి అప్డేట్ చేసుకోవడం కాని చేయాలని, మీరు తెలివైన వారైతే ఎలాంటి మాల్ వేర్స్ కి చిక్కకుండా జాగ్రత్తగా ఉండమని చెప్పారు నిపుణులు.