హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని అత్తాపూర్ మూసీనదిలో మొసలి కలకలం సృష్టించింది.హిమాయత్ సాగర్, గండిపేట వరదల్లో మొసలి కొట్టుకువచ్చినట్లు తెలుస్తోంది.
మూసీనదిలో మొసలి ఉండటాన్ని గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.మరోవైపు మొసలిని చూడటానికి స్థానిక ప్రజలు భారీగా వచ్చారు.
దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.







