టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అలీ గురించి అందరికీ పరిచయమే.హాస్య పాత్రల ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
ఈయన బాల నటుడుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై దాదాపుగా 1000కి పైగా సినిమాలలో నటించాడు.తొలిసారిగా కే విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రంతో బాల నటుడుగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.
ఆ తర్వాత వరుసగా బాలనటుడుగా ఎన్నో చిత్రాలలో నటించాడు.ఇక 1981 లో వచ్చిన సీతాకోక చిలుకతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత 1994లో యమలీల సినిమాలో హీరోగా నటించగా ఈ సినిమా ఆయన కెరీర్ కు మలుపు తిప్పిందని చెప్పవచ్చు.ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో హాస్య పాత్రలలో నటించాడు.
తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ హాస్యనటులలో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు.
ఇలా వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకెళ్లాడు.
ఇక మధ్య మధ్యలో సినిమాలు చేస్తూనే.బుల్లితెరపై వ్యాఖ్యాతగా చేస్తున్నాడు.
అంతేకాకుండా ఓ సీరియల్ లో కూడా నటించిన సంగతి తెలిసిందే.ఇక ఇటీవలే అందరూ బాగుండాలి.
అందులో నేనుండాలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవటంతో.
తాజాగా అలీ, పవిత్ర లోకేష్, నరేష్ కలిసి ఓ చిట్‌చాట్ వీడియో చేశారు.ఇక ఆ వీడియో బాగా వైరల్ అయింది.అందులో ముఖ్యంగా అలీ కి సంబంధించిన విషయాలు కొన్ని బయటపడ్డాయి.పైగా ఆలీ ఫస్ట్ నైట్ ప్రస్తావన వచ్చింది.ఇంతకు అసలు విషయం ఏంటంటే.ఓ సినిమా షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతుందని.
అందులో తాను, మౌర్య జంటగా ఫస్ట్ నైట్ సీన్ లో నటిస్తున్నామని తెలిపాడు అలీ.
ఇక అదే రోజు తన పెళ్లి రోజు కూడనట.అయితే షూటింగ్‌లోనే కేక్ కట్ చేయిస్తామని తన భార్యని, ముగ్గురు పిల్లలను షూటింగ్‌కి తీసుకొచ్చారట దర్శక, నిర్మాతలు.ఓ వైపు మానిటర్‌లో పిల్లలు, తన భార్య షూటింగ్ చూస్తున్నారట.
ఆ టైమ్‌లో తన ఫస్ట్ నైట్ సీన్ తీస్తున్నారట దర్శకుడు.పైగా ఆ ఫస్ట్ నైట్‌కి వాడింది కూడా తన మంచమేనని అన్నాడు.
ఇక అక్కడ వాళ్లు చూస్తుండగానే.ఆ ఫస్ట్ నైట్ సీన్ చేయడం తనకు ఇబ్బందిగా అనిపించిందని అన్నాడు అలీ. అయితే దర్శకుడు తమపై కోపంతో కావాలని ఆ సీన్ ప్లాన్ చేసినట్టు ఉందని సరదాగా చెప్పాడు అలీ.కావాలని తన మ్యారేజ్ డే రోజే ఆ సీన్ పెట్టడం, ఆ సమయంలోనే తమ ఫ్యామిలీని తీసుకురావడం తమపై జరిగిన కుట్రగా అని సరదాగా అన్నాడు అలీ.
వెంటనే నరేష్ మధ్యలో కలగచేసుకొని.ఒరిజినల్ ఫస్ట్ నైట్ గురించి టాక్ తీసాడు.
షూటింగ్ గ్యాప్‌లో ఫస్ట్ నైట్ చేసుకున్నావటగా అని అన్నాడు.ఇక అలీ కూడా ఓపెన్ అయ్యాడు.
అది 1994లో జనవరి టైమ్‌లో అని, తన మ్యారేజ్ జనవరి 22న అయ్యిందని అన్నాడు.ఇక 23 రిసెప్షన్ చేసుకుని 24న హైదరాబాద్ బయలు దేరి వచ్చానని అన్నాడు.
ఆ సమయంలో.కె.రాఘవేంద్రరావు తో ముద్దుల ప్రియుడు సినిమా షూటింగ్ చేస్తున్నానని, దీంతో అర్జెంట్‌గా రావాలని ఫోన్ చేయడంతో వెంటనే తన భార్య, అమ్మని తీసుకుని హైదరాబాద్ వచ్చానని అన్నాడు అలీ.ఇక సినిమా షూటింగ్‌లో ఉండగా.మధ్యలో రెండు గంటల షూటింగ్ బ్రేక్ దొరికితే ఆ టైమ్‌లో తన ఫస్ట్ నైట్ జరిగిందని అన్నాడు.ఇక నరేష్ వెంటనే.కేవలం రెండు గంటలే తన ఫస్ట్ నైట్ అంటూ సెటైర్లు వేసాడు.ఇక ఈ మ్యాటర్ ను ఎక్కువగా లాగకుండా అలీ అక్కడికే క్లోజ్ చేశాడు.