ప్రభాస్ హీరోగా, కృతి సనన్( Kriti Sanon ) హీరోయిన్ గా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Om Raut ) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ”ఆదిపురుష్” ( Adipurush ).ఈ పీరియాడిక్ వండర్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంగా మరొక పదమూడు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.
అందుకే మరింత ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాపై ఒక్కసారిగా ఒక్కసారికి హైప్ రావడానికి కారణం ట్రైలర్ అనే చెప్పాలి.
ఈ ట్రైలర్ నే నెగిటివ్ గా ఉన్న అంచనాలను పాజిటివ్ గా మార్చేసింది అని చెప్పాలి.ఆ తర్వాత నుండి ఈ సినిమా నుండి ఏ అప్డేట్ వచ్చిన ఆకట్టు కుంటుంది.
మరి ఈ సినిమా నుండి మరో ట్రైలర్ ఉందని ఎప్పటి నుండో టాక్ వస్తున్నా ఇప్పటికి ఈ రెండవ ట్రైలర్ గురించి అప్డేట్ వస్తుంది.మరి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెండవ ట్రైలర్ కూడా రెడీగా ఉందట.

ఈ ఆదిపురుష్ రెండవ ట్రైలర్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు అంటే జూన్ 6న రిలీజ్ చేస్తారని.భారీ అభిమానుల మధ్య ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని ఈ ట్రైలర్ ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో ఉంటుందని అంటున్నారు.మొత్తానికి జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఏ స్థాయిలో ఆకట్టు కుంటుందో వేచి చూడాలి.

ఇక తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.ఇప్పటికే తెలుగులో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలుస్తుంది.అలాగే వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు 1000 కోట్ల టార్గెట్ అయితే మేకర్స్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
ఇది రీచ్ అవుతుందో లేదో చూడాలి.







