నవంబర్ 30వ తారీకు తెలంగాణ పోలింగ్( Telangana Polling ) ముగిసింది.డిసెంబర్ 3వ తారీకు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి.
దీంతో ఎవరు ఈసారి అధికారంలోకి వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారంలోకి వచ్చిన కేసీఆర్( KCR ) పార్టీ.
ఈసారి అధికారంలోకి రావడం కష్టమని ఎగ్జిట్ పోల్స్ బట్టి వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.మరోపక్క అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడం జరిగింది.
ఈ క్రమంలో గెలుపు పై కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు ఎవరికి వారు.మేమే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సీఎం కేసీఆర్ డిసెంబర్ 4వ తారీఖు మొదటి క్యాబినెట్ మీటింగ్ అని కచ్చితంగా తామే అధికారంలోకి రాబోతున్నట్లు శుక్రవారం తెలియజేశారు.పరిస్థితి ఇలా ఉంటే బీజేపీ నేత రాజాసింగ్…( Raja Singh ) కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు.కేసీఆర్ నిద్రలేవాలి… ఇంకా పగటి కలలు కంటున్నారు.బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని అనుకుంటున్నారు.అటువంటి కలల నుంచి బయటకు రావాలి.బీఆర్ఎస్( BRS ) పని అయిపోయింది.
కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రారు.బీజేపీ లేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరుగుద్ది.
డిసెంబర్ మూడో తారీకు ఫలితాలు చూసి కేసిఆర్ సమావేశం రద్దు చేసుకుంటారని జాతీయ మీడియాతో మాట్లాడుతూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.







