బీజేపీ సీనియర్ నేత జీవియల్ వ్యాఖ్యలకు సీపీఎం నేత బీవీ రాఘవులు కౌంటర్..

యాంకర్ : బీజేపీ సీనియర్ నేత జీవియల్ వ్యాఖ్యలకు సీపీఎం నేత బీవీ రాఘవులు(Bv Raghavulu ) కౌంటర్ ఇచ్చారు.పిట్టలంటే అందరికీ గౌరవమని.

 Cpm Leader Bv Raghavulu Counter To Bjp Senior Leader Javiyal's Comments, Bv Rag-TeluguStop.com

మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవియల్ ధన్యవాదాలు తెలిపారు.పిట్టలు లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలన్నారు.

తాము పిట్టల పార్టీల వాళ్లమే అయితే వారిది రాబందుల పార్టీ కదా అని అన్నారు.తాము ప్రజల కోసం పని చేస్తామని, వారు పెట్టుబడిదారుల కోసం పని చేస్తారన్నారు.

సమాజాన్ని నాశనం చేయడానికే ఆ రాబంధులు పని చేస్తున్నారని బీవీ రాఘవులు మండిపడ్డారు.మా వల్ల ప్రజలకు మేలు జరిగితే వాళ్ల వల్ల అన్యాయం జరుగుతోందని అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్‌ను తొలగించి, కిషన్ రెడ్డి( Kishan Reddy )ని ఎందుకు పెట్టారని బీవీ రాఘవులు ప్రశ్నించారు.కర్నాటక, ఇతర రాష్ట్రాలలో వాళ్ల పార్టీ నాయకులను ఎందుకు మార్చారని నిలదీశారు.

వాళ్ల సంగతి వాళ్లు తెలుసుకుని ప్రజల ఆదరణ పొందితే మేలని అన్నారు.వైరుధ్యాలు ఉన్నా అనేక పార్టీలు కలిసి ఇండియాగా ఏర్పడ్డాయన్నారు.

మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు ఇండియా పని చేస్తోందన్నారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని ఓడించేలా ముందుకు సాగుతామని పేర్కొన్నారు.

సీపీఐ, సీపీఎంలు శాసన సభకు వెళ్లాలని ఎవరికి వారుగా పోటీ చేస్తున్నామని బీవీ రాఘవులు తెలిపారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube