తిరుపతి: సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సభల్లో అబద్థాలు చెప్పారు.
ఆర్థికమంత్రి పదవికి నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలి.మాఫియా గ్యాంగ్ కు కేంద్ర ఆర్థికమంత్రి సపోర్ట్ చేస్తున్నారు.కార్పొరేట్ కంపెనీలకు బిజెపి అగ్రనేతలు ఊడిగం చేస్తున్నారు.జి20 420చేతిలో పడింది.మోడీనే పెద్ద 420.జి20 లోగోను బిజెపి ఎన్నికల గుర్తుగా మార్చి ప్రచారం చేసే దుస్థితి రాబోతోంది.బిజెపి ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలో మాత్రమే సొంతంగా గెలిచింది.దేశంలో బిజెపి వెలిగిపోతోందనడంలో నిజం లేదు.బిజెపిని విమర్సించే ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.రాజకీయ దురుద్ధేశంతో కేంద్రప్రభుత్వం ఇడి, సిబిఐలను ఉసిగొల్పుతున్నారు.
ఖాళీ స్థలాలు కనిపిస్తే వైసిపి నేతలు కబ్జా చేస్తున్నారు.నగరి నియోజకవర్గంలోని అయినంబాక్కంలోను ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారు.
వైసిపికి వ్యతిరేకంగా ఉన్న గ్రామాలను గుర్తించి ఆ ప్రాంత వాసులను భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం జరుగుతోంది.ఎపికి ఒక్క పరిశ్రమ రావడం లేదు కదా.ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోతున్నాయి.ఎపిలో అప్పులు, ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయండి.
వైసిపికి ఎంత మంది సలహాదారులు ఉన్నారో సిఎం చెప్పాలి.వారి ఫోటోలను విడుదల చేయాలి.175స్థానాలు వస్తాయని జగన్ కలలుగంటున్నారు.ఎపి సిఎం జగన్ కన్నా గాలి జనార్థన్ రెడ్డి నయం.జిందాల్ పరిశ్రమ కూడా ఎపి నుంచి త్వరలో వెళ్ళిపోబోతోంది.మాచర్లలో టిడిపి కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నా.
ప్రతిపక్షాలను స్వేచ్ఛగా తిరగనివ్వరా.ప్రభుత్వ అమర్థతను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా.? వైసిపి దాడులను ఐక్యంగా ఎదుర్కొందాం.