విజయనగరం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు.ఇందులో భాగంగా ఈనెల 22 నుంచి 24 వరకు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.
ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.ఈ క్రమంలో 22న రాజాం, 23న బొబ్బిలి, 24న విజయనగరం నియోజకవర్గాల్లో కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.







