బండి సంజయ్ వ్యాఖ్యలకు సి.పి.
ఐ నేత కూనంనేని కౌంటర్ ఇచ్చారు.బండి సంజయ్ అసహనంతో మాట్లాడుతున్నారని అన్నారు, చట్టాలు, వ్యవస్థ పై నమ్మకం లేని వ్యక్తి బండి సంజయ్ అని విమర్శించారు.
ఢిల్లీ డీల్ కు బండి సంజయ్ ప్రమాణం చేయడం ఎందుకు అని ప్రశ్నించారు.దమ్ముంటే మోడీతో ప్రమాణం చేయించాలి అని డిమాండ్ చేశారు.చాలా రాష్ట్రాలు సిబిఐ ని బహిష్కరించాయి అని, అందులో భాగంగా తెలంగాణ సర్కార్ సిబిఐ కి అనుమతి నిరాకరించిందని తెలిపారు.కమ్యూనిస్టు పార్టీలు వేల కోట్లు తీసుకున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారని, బిజెపిని గద్దె దించేందుకు మేం లౌకిక శక్తులతో కలిసామని అన్నారు.