ఎర్రజెండాను అక్కున చేర్చుకునేది ఎవరో..చాడ ఏమంటున్నారంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీల్లో ఉండేటువంటి అసమ్మతి బయటకు వస్తోంది.

అంతేకాకుండా ప్రధాన పార్టీలన్నీ వారి వారి ఎన్నికల ఏజెండాని బయట పెడుతూ ప్రజల ముందుకు వెళ్తున్నాయి.

ఇందులో అధికార బిఆర్ఎస్ పార్టీ( BRS party ) ఇప్పటికే 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది.అంతేకాకుండా ఎవరితో పొత్తులు ఉండవని కరాకండిగా చెప్పేసింది.

ఈ తరుణంలోనే పొత్తులలో భాగంగా కొన్ని సీట్లు కేటాయిస్తారని భావించిన ఎర్రజెండా పార్టీలకు చుక్కెదురైందని చెప్పవచ్చు.అయితే నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్( BRS )పార్టీకి దీటుగా బుద్ధి చెప్పాలని ఎర్రజెండా పార్టీలు సమయత్తం అవుతున్నాయి.

ఆ వివరాలు ఏంటో చూద్దాం.

Advertisement

మునుగోడు ఎలక్షన్ల సమయంలో సిపిఐ( CPI), సిపిఐ (ఎం) ( CPI.M ) సహకారంతో బీఆర్ఎస్ గెలుపు సొంతం చేసుకుంది.ఇకపై ఎలక్షన్స్ అయిపోయే వరకు పొత్తులు ఉంటాయని హామీ ఇచ్చింది.

పొత్తుల్లో భాగంగా కొన్ని సీట్లు కేటాయిస్తామని హామీ కూడా ఇచ్చారు.కానీ చివరికి పొత్తులు ఉండేది లేదని మేము సొంతంగా పోటీ చేస్తామని కేసీఆర్ సర్కార్ ప్రకటన చేసిన నేపథ్యంలో ఎర్రజెండా పార్టీలన్నీ ఒక్కసారిగా షాక్ అయ్యాయి.

ఈ తరుణంలోనే వారి భవిష్యత్ కార్యాచరణను ముందుకు తీసుకెళుతున్నాయి.ఇదే విషయంపై సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి( CHADA VENKAT REDDY )కీలక వ్యాఖ్యలు చేశారు.

పొత్తు ధర్మాన్ని కేసీఆర్( CM kcr) పాటించలేదని, వచ్చే ఎన్నికల్లో మాకు పట్టున్న ప్రతి స్థానంలో పోటీ చేస్తామని అన్నారు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

పొత్తుల కోసం మేము ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం మాకు లేదని, ఇప్పటికే పొత్తని చెప్పి బీఆర్ ఎస్( BRS )మమ్మల్ని మోసం చేసి వారికి వారే టికెట్లు కేటాయించుకున్నారని ఆరోపించారు.ఒకవేళ ఎవరైనా పొత్తుల గురించి అడిగితే ఆలోచిస్తామని, తప్పనిసరిగా బలమున్న ప్రతిచోట పోటీ చేస్తామని అన్నారు.మా ప్రధాన లక్ష్యం బిజెపిని( Bjp )ఓడించడమే అని తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు