వైజాగ్ రైల్వే స్టేషన్‌లో ఆంక్షలు కఠినం చేసిన అధికారులు.. !

కరోనా క్రమక్రమంగా ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టివేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

ఇప్పటికే దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ కేసుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనం మరోసారి లాక్‌డౌన్ విధిస్తే భరించలేని నిస్సహయ స్దితిలో ఉన్న విషయం తెలిసిందే.

ఇకపోతే ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు తీవ్రతరం అవుతున్న సంగతి విదితమే.ఇప్పటికే కోవిడ్ విషయంలో ఆంక్షలు అమలులో ఉండగా తాజాగా విశాఖ రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు.

రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రత్యేక చర్యలు చేపట్టారు.కాగా ఇప్పటి వరకు స్టేషన్‌లోకి వచ్చిపోయే ప్రయాణికులను ఒకే దారి నుంచి అనుమతిస్తుండగా, ఇక నుంచి రెండు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేశారు.

ఈమేరకు ప్రయాణికులను జ్ఞానాపురం గేట్ వద్దనున్న 8వ నంబరు ప్లాట్‌ఫాం నుంచి స్టేషన్‌లోకి అనుమతిస్తుండగా, బయటకు వెళ్లేవారు ఒకటో నంబరు ప్లాట్ ఫాం నుంచి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు.ఇక స్టేషన్‌లోకి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ తప్పని సరి చేశారు.

Advertisement

అదీగాక స్టేషన్‌లో ఎవరూ గుంపులుగా ఉండొద్దని, ఆహారం కూడా ఎవరికివారే తెచ్చుకోవాలని, ఏసీ బోగీల్లో దుప్పట్లు, బెడ్‌షీట్లు సరఫరా చేయబోమని అధికారులు వెల్లడించారు.ఇక కరోనా నియంత్రణ నియమాలను తప్పని సరిగ్గా ప్రయాణికులందరు పాటించాలని సూచించారు.

అల్లు అర్జున్ తో డాన్స్ చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యాను.. రష్మిక సంచలన వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు