కరోనా నుంచి గవర్నర్ సేఫ్... అయిన హోం క్వారంటైన్ లోనే

ఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది.రోజుకి తక్కువలో తక్కువగా ఎనభై కేసుల వరకు నమోదు అవుతున్నాయి.

కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచడం వలెనే కేసుల సంఖ్య ఎక్కువగా బయటపడుతున్నాయని ప్రభుత్వం చెబుతుంది.అయితే కరోనా కేసులు పెరగడానికి కారణంగా అధికారుల మర్కజ్ కి వెళ్లి వచ్చిన వారిని వెంటనే గుర్తించి వారిని క్వారంటైన్ కి తరలించాకపోవడం, అలాగే వారు స్వచ్చందంగా ముందుకి రాకపోవడం కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ప్రజలని మాత్రం భయపెడుతున్నాయి.అయితే ఈ కేసుల విషయంలో అధికార, ప్రతిపక్షాలు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడానికి ఇచ్చే ప్రాధాన్యత కంట్రోల్ చేయడానికి ఇవ్వడం లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కరోనా రాజ్ భవన్ ఉద్యోగులని కూడా తాకిన విషయం తెలిసిందే.రాజ్ భవన్ లో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలింది.

Advertisement

కరోనా ఉన్నట్టు నిర్ధారణ అయినవారిలో ఒకరు గవర్నర్ సెక్యూరిటీ ఆఫీసర్ కావడం గమనార్హం.మిగిలినవారిలో ఇద్దరు అటెండర్లు, ఒక స్టాఫ్ నర్సు ఉన్నట్టు గుర్తించారు.

అయితే, ఊరట కలిగించే అంశం ఏమిటంటే, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు కరోనా పరీక్షలు నిర్వహిచంగా నెగెటివ్ అని వచ్చింది.రాజ్ భవన్ లోని ఇతర సిబ్బందికి కూడా టెస్టులు నిర్వహించగా, నెగెటివ్ అని తేలిందని ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెల్లడించారు.

అయిన కూడా ముందస్తు జాగ్రత్త చర్యలుగా గవర్నర్ హోం క్వారంటైన్ కి పరిమితం అయ్యారు.అలాగే రాజ్ భవన్ ఉద్యోగులని కూడా హోం క్వారంటైన్ లో ఉంచారు.

ఓరిని వేశాలో.. డాక్టర్ చేతిలో ఇంజెక్షన్ చూడగానే.. అమ్మాయి ఏకంగా (వీడియో)
Advertisement

తాజా వార్తలు