వైరల్: సీమంతం వేడుకలో డాన్స్ చేసిన నిండు గర్భిణి... ఇదేమన్నా పెళ్లి వేడుకా?

మన దేశంలో వేడుకలకు కొదువే లేదు.ఇక్కడ మనిషి జీవితంలో ప్రవేశించిన ప్రతీ గుడ్ మూమెంట్ ని సెలిబ్రేట్ చేసుకుంటారు.

 Couple Dancing At Their Baby Shower Function Video Viral Details, Dance, Srimant-TeluguStop.com

ఇక కొన్ని ప్రాంతాల్లో శుభకార్యం ఏదైనా కానీ, ఆటపాటలు లేనిదే ఆ కార్యం పరిపూర్ణం కాదనే చెప్పుకోవాలి.ఈ క్రమంలో తమకు ఇష్టమైన పాటలు పెట్టుకుని వచ్చినట్టుగా డాన్స్ చేస్తూ సరదా సరదాగా సందడి చేస్తుంటారు.

అందులోనూ వివాహాలు, పుట్టినరోజులు సమయాల్లో అయితే ఇక చెప్పనక్కర్లేదు.చిన్నపిల్లల్లాగా ఇల్లు పైకి పందిరేస్తారంటే అతిశయోక్తి కాదు.

అదంతా ఒకెత్తయితే ఇపుడు సీమంతం వేడుకల్లో కూడా అతివలు తమ భర్తలతో స్టెప్పులేస్తున్నారు.అదేంటి? అది కరెక్టు కాదు కదా? అని అనుకుంటున్నారు కదూ.కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూశారంటే మీరు ఖచ్చితంగా నమ్ముతారు.

గర్భిణీకి చేసే సీమంతం కార్యక్రమం కూడా ఇప్పుడు ట్రెండ్‌ సెట్‌చేసేలా నిర్వహించారు ఓ కుటుంబీకులు.అవును, కాబోయే ఆ తల్లిదండ్రులు తమ బేబీ షవర్‌లో డ్యాన్స్ చేసిన జంట చుట్టూవున్నవాళ్ళని బాగా అలరించింది.ఆ సంతోషకరమైన సందర్భంలో భార్యాభర్తలిద్దరూ సంతోషంగా డ్యాన్స్ చేయడం ఇక్కడ వీడియోలో మనం గమనించవచ్చు.

అయితే సదరు తంతుని కొంతమంది నెటిజన్లు మెచ్చుకుంటుంటే కొంతమంది తిడుతున్నారు.నిండు చూలాలు అలా డాన్స్ చేయడం మంచిది కాదని కొందరంటే, సీమంతం భారీగా చేసుకోవడం ఓకే గాని, అలా ప్రతి దానికి డాన్సులు చేసి అతి చేయకండి అని కొందరు అంటున్నారు.ఇంకొందరైతే అలా డాన్సులు చేయడం ఈ సమయంలో తప్పు, మీకు డాక్టర్ చెప్పలేదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.కాగా ఆ జంట కింగ్‌ సినిమాలోని ‘మాన్‌ మేరీ జాన్‌’ పాటకు స్టెప్పులేస్తూ సందడి చేయడం ఈ వీడియోలో చూడవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube