విజయవాడలో దంపతులు ఆత్మహత్య..!!

ప్రస్తుత సమాజంలో ఆత్మహత్య( suicide ) ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ముందు వెనక ఆలోచించుకోకుండా క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

ప్రధానంగా ఈనాటి యువత కష్టాలను అధిగమించుకోలేక చనిపోతున్నారు.అదేవిధంగా భార్యాభర్తలు కూడా ఈ రకంగానే తమ ప్రాణాలను కోల్పోతున్నారు.

రకరకాల కారణాలతో కుటుంబాలలో ఆత్మహత్య ఘటనలు నానాటికి పెరిగిపోతున్నాయి.ఈ రకంగానే విజయవాడ( Vijayawada )లో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.

విషయంలోకి వెళ్తే రామలింగేశ్వర నగర్ లో స్థానికంగా ఉంటున్న దంపతులు కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారట.దీంతో ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడటం జరిగింది.

Advertisement

ఈ ఘటన స్థానికంగా చాలామందిని కలిచివేసింది.దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మొత్తం పరిశీలించి స్థానికుల దగ్గర వివరాలు సేకరించారు.

అనంతరం మృతుల కుటుంబాలకు సమాచారం అందజేయడం జరిగింది.ఆ తర్వాత మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు( Police ) కేసు నమోదు చేయడం జరిగింది.ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదే సమయంలో ఆర్థిక ఇబ్బందులను ధైర్యంగా ఎదుర్కోవాలని.క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవద్దని పోలీసులు సూచించారు.

వీడియో వైరల్ : ఏంటి భయ్యా.. ఇవి రోడ్డు డివైడర్స్ కాదా.. మరేంటో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు