ఢిల్లీలోని భారత్ మండపం వేదికగా నిర్వహించిన రెండో రోజు బీజేపీ జాతీయ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( PM Narendra Modi ) హాజరయ్యారు.రానున్న వంద రోజులు ఎంతో కీలకమని ఈ సందర్భంగా మోదీ తెలిపారు.18 ఏళ్లు నిండిన వాళ్లు 18వ లోక్ సభకు( Lok Sabha ) ఓటు వేయబోతున్నారని పేర్కొన్నారు.ఈ క్రమంలో పార్టీ శ్రేణులు కలిసి పని చేయాలన్నారు.
ప్రజలందరి విశ్వాసాన్ని చూరగొనాలన్న మోదీ బీజేపీ( BJP ) అత్యధిక సీట్లు గెలుచుకోబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
మన సంకల్పం వికసిత భారత్( Vikasitha Bharat ) అని, నవ భారత నిర్మాణం కోసం అందరం కలిసి పని చేద్దామని పిలుపునిచ్చారు.గత పదేళ్లలో దేశం రూపురేఖలు మారిపోయాయని చెప్పారు.త్వరలోనే ప్రజల స్వప్నాలు సాకారం కానున్నాయని పేర్కొన్నారు.
రానున్న ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకోవాలన్నారు.తనకు వ్యక్తిగత ప్రతిష్ట, కుటుంబం ముఖ్యం కాదన్న మోదీ తనకు రాజకీయాలు ముఖ్యం కాదని, దేశమే ముఖ్యమని స్పష్టం చేశారు.