అక్కడికి వెళ్లాలంటే మీరు అరబ్ దేశం సౌదీ అరేబియా వెళ్లాల్సిందే.అవును, సౌదీ అరేబియా ఎన్నో రకాల అద్భుతమైన కట్టడాలకు నిలయం.
తాజాగా మరో అద్భుతమైన నిర్మాణాన్ని వచ్చే ఏడాది నుంచి అందుబాటులో తీసుకొచ్చే పనిలో పడింది.ప్రకృతి ఒడి మధ్యలో ఎంతో సుందరంగా నిర్మితమవుతున్న ఆ కట్టడం ఒక రిసార్ట్ హోటల్.
ఆ దేశ షాబారా దీవిలో అది తుది రూపు దిద్దుకుంటోంది. Sheybarah Resort పేరుతో నిర్మితమైన ఈ హోటల్ ని ‘రెడ్ సీ గ్లోబల్ డెవలపర్స్‘ అనే సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతుంది.

కాగా 2024 నుంచి అతిథులకు ఈ రిసార్ట్ ఆతిథ్యం ఇవ్వనుందని అక్కడి మీడియాలలో ఓ కధనం వెలువడడం గమనార్హం.ఇక దానిగురించి విషయాలు సేకరించిన పలువురు దానిని భూతల స్వర్గం అని పిలుస్తున్నారు.ఇది ‘మోస్ట్ ఫ్యూచరిస్టిక్ హోటల్ ఇన్ ది వరల్డ్’ అని దానిని నిర్మించిన సంస్థ చెప్పడం కొసమెరుపు.షాబారా దీవిలోని చుట్టూ దట్టమైన మడ అడవులు, ఎడారి వృక్షాల నడుమ దీనిని ఆధునాతన హంగులతో ఎంతో సుందరంగా నిర్మిస్తున్నారు.
పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని విధంగా పూర్తిగా సౌరవిద్యుత్‌తో నడిచేలా రూపొందిస్తున్నారని వినికిడి.

ఈ రిసార్ట్‌లో ఒకేసారి 140 మంది అతిథులకు వసతి సౌకర్యం అందుబాటులో ఉండేలా చూస్తున్నారు.ఇక అతిథులకు సేవలు చేయడానిక 260 మంది సిబ్బంది అక్కడ ఎల్లప్పుడూ అందుబాటులో వుంటారు.ఈ ప్రాజెక్ట్ పూర్తిగా జీవవైవిధ్యాన్ని కాపాడేలా ఉంటుందని దీన్ని నిర్మిస్తున్న సంస్థ అధినేత జాన్ పగానో చెప్పడం విశేషంగానే చెప్పుకోవాలి.
కాగా ఇది సౌదీ పర్యాటకరంగం భవిష్యత్తునే మార్చేయగలదని అక్కడి ప్రభుత్వం నమ్ముతోంది.సౌరశక్తితోనే పనిచేసే డీశాలినేషన్ ప్లాంట్ రిసార్ట్‌కు మంచినీటిని సరఫరా చేస్తుంది.అతిథులకు డ్రైవర్‌లేని బగ్గీలు కూడా అందుబాటులో ఉంటాయి.







