సెన్సార్ బోర్డ్‌ లంచాలు.. అందుకే ఆ సినిమాలకు క్లియరెన్స్‌!

ఒక భాష లో సెన్సార్ క్లియరెన్స్ రాని సినిమా లకు మరో భాష కి చెందిన సెన్సార్ బోర్డ్‌ వారు క్లియరెన్స్ ఇవ్వడం మనం ఇప్పటి వరకు ఎన్నో సార్లు చూశాం.అలా జరిగింది అంటే అవినీతి జరిగింది అని అర్థం అంటూ తాజాగా తమిళ్ హీరో విశాల్ చేసిన వ్యాఖ్యలతో తేలిపోయింది.

 Corruption In Film Industry Censor Board ,corruption,cbfc,censor Board,vishal,ko-TeluguStop.com

సెన్సార్ బోర్డ్‌ కు తాను లంచం ఇచ్చాను అంటూ స్వయంగా చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి.హిందీ సెన్సార్ బోర్డ్ కోసం తాను ఏకంగా రూ.6.5 లక్షల లంచం ఇచ్చినట్లుగా విశాల్ పేర్కొన్నాడు.అందుకు సంబంధించిన సాక్ష్యాలు నా వద్ద లేవు.కానీ నేను డబ్బులు ఇచ్చాను అంటూ విశాల్ పేర్కొన్నాడు.

Telugu Cbfc, Censor Board, Kollywood, Telugu, Tollywood, Vishal-Movie

ఈ విషయం లో విశాల్ ఎదుర్కొన్న సమస్య ను గతం లో చాలా మంది హీరో లు కూడా ఎదుర్కొన్నారు.చాలా మంది నిర్మాతలు లక్షలకు లక్షలు లంచం ఇచ్చి మరీ సెన్సార్ క్లియరెన్స్ తెచ్చుకున్నారు.గతంలో సెన్సార్‌ బోర్డ్‌ లో మొదట తిరష్కరణ కి గురై ఆ తర్వాత సెన్సార్ క్లియరెన్స్ ని దక్కించుకున్న సినిమా లు చాలా ఉన్నాయి.వాటిల్లో ఎక్కువ శాతం నిర్మాత లు లంచం ఇచ్చినవే అనేది చాలా మంది అభిప్రాయం.

ఇప్పుడు విశాల్ బయటకు వచ్చాడు కానీ చాలా మంది నిర్మాతలు ఇప్పటి వరకు లంచాలు చాలా సార్లు ఇచ్చి కూడా సైలెంట్ గా ఉండి ఉంటారు.తమ పని అయితే చాలు.

ఎలా జరిగితే ఏంటి అంటూ చాలా మంది అభిప్రాయం తో ఉన్నారు.

Telugu Cbfc, Censor Board, Kollywood, Telugu, Tollywood, Vishal-Movie

కనుక ఈ పద్దతులు ఏమాత్రం సరి కాదు.లంచం ఇచ్చి ఏ సర్టిఫికెట్ కావాలి అంటే ఆ సర్టిఫికెట్ ను తీసుకున్న నిర్మాతలు చాలా మంది ఉన్నారు.చాలా మంది నిర్మాతలకు అదే కావాలి.

నిర్మాత అయిన విశాల్ ఇప్పుడు ఈ విషయాన్ని బయటకు తీసుకు రావడం ను కొందరు నిర్మాతలు తప్పుబడుతున్నారు.మొత్తానికి సెన్సార్‌ బోర్డ్‌ లో అవినీతి తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube