మహిళల్లో ఆ సమస్యలకు కారణమవుతున్న కరోనా వ్యాక్సిన్..?

ప్రపంచ దేశాల్లో గత కొన్ని నెలలుగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే.

కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గీ కొన్ని దేశాల్లో మళ్లీ పెరుగుతూ ఉండటంతో ఈ వైరస్ ప్రజలను టెన్షన్ పెడుతూనే ఉంది.

త్వరలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని.వ్యాక్సిన్ తీసుకుంటే వైరస్ బారిన పడమని ప్రపంచ దేశాల ప్రజలు విశ్వసిస్తున్నారు.

అయితే ఈ వ్యాక్సిన్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడతామని ప్రజలు భయపడుతున్నారు.తాజాగా కరోనా వ్యాక్సిన్ గురించి వైరల్ అవుతున్న ఒక వార్త కరోనా వ్యాక్సిన్ తీసుకునే మహిళలను టెన్షన్ పెడుతోంది.

ఒక అధ్యయనం ప్రకారం కరోనా వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో సంతానోత్పత్తికి సంబంధించిన సమస్యలు వస్తాయని వెల్లడైంది.పలువురు నిపుణులు సైతం మహిళల్లో సంతానోత్పత్తిపై కరోనా వ్యాక్సిన్ ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.

Advertisement

వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో గర్భధారణకు సంబంధించిన సమస్యలు రావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.లండన్ కు చెందిన గైనకాలజిస్ట్ లలో ఒకరైన జేమ్స్ ప్రస్తుతం గర్భంతో ఉన్న మహిళలు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోకూడదని.

గర్భిణులు వ్యాక్సిన్ తీసుకుంటే బిడ్డపై కూడా వ్యాక్సిన్ ప్రభావం ఉంటుందని వెల్లడిస్తున్నారు.గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే తల్లితో పాటు బిడ్డకు కూడా ప్రమాదమేనని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్దారు.

జేమ్స్ కరోనా వ్యాక్సిన్ గర్భిణులపై సురక్షితమేనని చాలా తక్కువ మొత్తంలో డేటా ఉందని అందువల్ల వ్యాక్సిన్ వల్ల గర్భిణులపై ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు.ఒకవైపు కరోనా మహమ్మారి వల్ల భయాందోళనకు గురవుతున్న ప్రజలకు కరోనా వ్యాక్సిన్ కూడా టెన్షన్ పెడుతోంది.

ఇప్పటికే పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుండగా వ్యాక్సిన్ తీసుకున్న కొంతమంది సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడుతుండటం గమనార్హం.

అదృష్టం అంటే ఇదే కాబోలు.. రెప్పపాటులో ప్రమాదం నుండి తప్పించుకున్న బైక్ రైడర్స్..
Advertisement

తాజా వార్తలు