తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.స్వల్ప లక్షణాలు కనిపించడంతో తన ఇంటిలోనే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.
దీంతో నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టిన పాదయాత్రకు దూరమయ్యారు.నారాయణపూర్ నుంచి చౌటుప్పల్ దాకా సాగనున్న ఈ యాత్ర రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రారంభం కావాల్సి ఉంది.
ఇలాంటి తరుణంలో కరోనా లక్షణాలు కనిపించడంతో.పాదయాత్రకు రాలేనని వివరిస్తూ రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు, కార్యకర్తలకు సందేశం పంపారు.