ఈ ఏడాది పండగలు, ఉత్సవాలపై కరోనా ప్రభావం పడింది.అంగరంగ వైభవంగా జరుపుకునే పండగలు సందడి లేకుండానే జరుపుకోవాల్సిన పరిస్థితి.
కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వాలు కూడా పండగలను జరుపుకోవద్దని, ఒక వేళ జరుపుకున్నా అది నిబంధనలకు అనుగుణంగానే జరగాలని పేర్కొంది.ఇంట్లో వేడుకలు జరుపుకున్న ఎలాంటి ఆర్భాటాలు లేకుండా వేడుకలు జరుపుకోవాలని సూచించింది.
అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం నెల్లూరు జిల్లాలో ప్రతి ఏడాది వైభవంగా జరుపుకునే రొట్టెల పండుగపై కరోనా ప్రభావం పడింది.ప్రభుత్వం కరోనా వ్యాప్తి కారణంగా ఈ పండుగపై నిషేధం విధించింది.
దర్గాలో ఈ నెల 30వ తేదీ నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకూ 5 రోజుల పాటు జరిగే గంధమహోత్సవానికి కేవలం 20 మందికే అనుమతిని ఇచ్చింది.మొహర్రం పండుగ తర్వాతి మూడో రోజు నెల్లూరు జిల్లాలోని స్వర్ణాల చెరువులో భక్తులు రొట్టెలు వదిలి కోరికలు తీర్చుకుంటారు.
అయితే ఇలా చేయడం కొత్తేం కాదు.అనాధిగా వస్తున్న ఆచారం.
సుమారు 100 ఏళ్లుగా భక్తులు రొట్టెల పండుగ ఉత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నారు.మొదట్లో ఈ పండుగను కేవలం ఒక్కరోజే జరుపుకునే వారు.
తర్వాతి రోజుల్లో భక్తుల రద్దీ పెరగడంతో 5 రోజులకు మార్చారు.పండుగను చూడటానికి దేశవ్యాప్తంగా ప్రజలు ఇక్కడి వస్తుంటారు.
దీంతో ప్రభుత్వం రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా మార్చింది.







