తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసులు..!!

దేశంలో కరోనా మహామ్మారి మరోసారి పంజా విసురుతోంది.దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.

తెలంగాణలో నిన్న ఒక్కరోజు ఎనిమిది కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయని వైద్యాధికారులు తెలిపారు.ప్రస్తుతం రాష్ట్రంలో 46 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

అటు ఏపీలో ఒక్కరోజు వ్యవధిలో ఐదు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.కాగా ఏపీలో ఇప్పటివరకు మొత్తం 25 కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.

వీటిలో 17 కేసులు విశాఖలో నమోదు కాగా ఒకటి శ్రీకాకుళంలో నమోదు అయిందని తెలుస్తోంది.కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ ఇప్పటికే సమీక్ష నిర్వహించారు.

Advertisement

సీఎం ఆదేశాల మేరకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు సిలిండర్లను అధికారులు సిద్ధం చేశారు.అలాగే గ్రామ, వార్డు సచివాలయాల వద్ద టెస్టింగ్ కిట్లను సైతం అధికారులు అందుబాటులో ఉంచారు.

దాంతో పాటు రాష్ట్రంలో మొత్తం 56,741 ఆక్సిజన్ బెడ్లను సిద్ధం చేసింది.అయితే కరోనా కొత్త వేరియంట్ జేఎన్ -1 ప్రమాదకరమైన వైరస్ కాకపోయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు