భారత్ లో కరోనా కరోనా సృష్టిస్తోంది. రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది.
ఈ నేపథ్యంలో తాజాగా 1890 కొత్త కేసులు నమోదు అయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.నిన్నటితో పోలిస్తే 300 కేసులు అధికంగా నమోదు అయ్యాయని తెలుస్తుంది.
తాజా కేసులతో కలిపి భారత్ లో ప్రస్తుతం 9,433 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యాధికారులు వెల్లడించారు.కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.